హైదరాబాద్: రాష్ర్ట కేబినెట్ లో మునుపెన్నడూ లేని విధంగా కుల పిచ్చి మొదలైంది. రాష్ర్ట మంత్రులు కులాల వారీగా విడిపోతున్నారు. తాను ఫలాన కులానికి చెందిన వారిని కాబట్టే తనపై ఇలా వ్యవహారిస్తున్నారంటూ మంత్రులే తమతోటి మంత్రులపై, ముఖ్యమంత్రిపై ఆరోపణలకు దిగుతున్నారు. మంత్రుల కుల పిచ్చి రోజు రోజుకూ ముదురుతోంది. కుల పిచ్చి కిరణ్ సర్కార్కు ఎసరు పెట్టే వరకు వెళ్తోంది. రాష్ర్ట మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు తాము కుల, మత, రాగ, ధ్వేషాల జోలికెళ్లకుండా అందరికీ సమానంగా ఉంటామనీ చేసిన ప్రమాణాలన్నీ పలువురు మంత్రులు గాలికి వదిలేసినట్లే కనిపిస్తోంది. ఎవరు ఔనన్నా, కాదన్నా కిరణ్ కేబినెట్ లో మంత్రులు రెండు కులాలుగా చీలిపోయారన్నది వాస్తవం.  తొలుత మాజీ మంత్రి శంకర్ రావు రూపంలో ఈ కుల కార్డు ప్రయోగం మొదలై నిన్నటి దానం నాగేందర్ వరకు కొనసాగుతూనే వుంది. శంకర్ రావయితే ఏకంగా రాష్ర్ట ముఖ్యమంత్రిని టార్గెట్ గా చేసుకుని ఆరోపణలు చేశారు. తాను ఎస్సీ అయినందుకే రెడ్డి అయిన కిరణ్ తనను మంత్రి వర్గం నుంచి తొలగించాడంటూ ఒకదశలో రాష్ర్టంలో కులాల మధ్యన కుంపటి రాజుకునే విధంగా చేశాడు. అంతటితో ఆగకుండా రాష్ర్టంలో అధిక జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలను కేవలం ఆరేడు శాతం కలిగిన ఓ కులస్థులు రాష్ర్టాన్ని ఏలుతున్నారంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశాడు. ఆ తరువాత జగన్ అక్రమ ఆస్తుల కేసులో, మద్యం సిండికేట్ల నుంచి మామూళ్లు తీసుకున్నారనీ ఆరోపణలు వచ్చి చివరకు జైలు పాలైన మోపిదేవి వెంకటరమణ కూడా తాను బీసీ అయినందు వల్లనే వేధిస్తున్నారన్నాడు. మోపిదేవి కోసం ఆయన వర్గం బంద్ పాటించింది. ఫెరా నిబంధనలను ఉల్లంఘించారంటూ కోర్టు జైలు శిక్ష విధించిన పార్థసారధి కూడా బీసీ అయినందు వల్లనే వేధిస్తున్నారంటున్నారు. తాజాగా దానం నాగేందర్ వంతు వచ్చింది. నగరంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన సంఘటనలో ఇస్కాన్ ప్రతినిధులను, విధుల్లో ఉన్న ఎస్ఐ రమేశ్ను తీవ్ర పరుష పదజాలంతో దూషించినందుకు కేసులు నమోదు కావడంతో దానం కూడా తాను బీసీ కావడం వల్లనే కేసులు పెడుతున్నారంటూ కుల వివాదానికి తెరలేపారు. విధుల్లో ఉన్న ఎస్ఐ రమేశ్ను బట్టలు ఊడదీసి కొడతాననీ అన్నందుకు ఎస్ఐ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దానంపై ఏడు సెక్షన్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి దానం కులం కార్డును ప్రయోగిస్తున్నారు. పోలీసులు కేసు పెడితే ఆ నెపాన్ని హెంశాఖ మంత్రి సబితారెడ్డి వేస్తున్నాడు. మహిళా మంత్రి అని కూడా చూడకుండా సబితపై వ్యంగ్యంగా మాట్లాడారు. అంతటితో ఆగకుండా, తనకు మద్దతుగా వీహెచ్, ప్రసాదరాజు, జయసుధ లాంటి మద్దతుదారులను కూడబెట్టుకునే పనిలో ఉన్నాడు. తాను బలహీన వర్గానికి చెందిన కావడంతోనే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందనీ కులం కార్డును తీశాడు.  సీఎంను, హెంశాఖ మంత్రిని టార్గెట్ గా చేసుకుని దానం కులం కార్డును అడ్డుపెట్టుకుని ఎన్ని విమర్శలు చేసినా కూడా సబితారెడ్డి మాత్రం కూల్ గా స్పందించింది. మద్యం ముడుపుల ఆరోపణలు వచ్చిన మోపిదేవి కూడా కులంకార్డు ప్రయోగించి తొలుత తప్పించుకున్నా, తరువాత కోర్టులో ఆయన శిక్ష పడ్డ విషయం విధితమే. పార్థసారధి విషయంలో కూడా అదే జరగబోతోంది. రేపో,మాపో దానం నాగేందర్ విషయంలోనూ అదే జరగదనీ గ్యారంటీ లేకపోలేదు. చేసిన తప్పులన్నీ చేస్తూ కులం కార్డును అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం ఎవరికీ తగదు. కుల, మత రాజకీయాల వల్ల తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కానీ, దీర్ఘకాలంలో అవి పనిచేయవనీ మోపిదేవి, పార్థసారధి విషయంలోనే రుజువయ్యాయి. ఇప్పటికైనా రాష్ర్ట మంత్రులు కులం కార్డుతో చేస్తున్న రాజకీయాలు మానుకుంటేనే బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: