2019 ఎన్నికలలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోబోతోంది అని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ రాజకీయ వేత్త నిర్వహించిన సర్వేలో ఈ వాస్తవాలు బయటకు వచ్చాయి అన్న ప్రచారం గత రెండు రోజులుగా రాజకీయ వర్గాలలో జరుగుతోంది. దీనితో తెలుగుదేశం అధి నాయకత్వం గుండెలలో గుబులు బయలుదేరింది అన్న వార్తలు కూడ వస్తున్నాయి. 

ఆశ్చర్యకరమైన ఈ సర్వేలోని యదార్దాలు ఎలా ఉన్నా నిన్న అత్యంత ఘనంగా రామోజీ ఫిలింసిటీలో జరిగిన రామోజీరావు మనవరాలి పెళ్ళికి జగన్ మోహన్ రెడ్డి రావడమే కాకుండా ఆ వేడుకకు వచ్చిన జగన్ ను అత్యంత అభిమానంగా రామోజీరావు స్వాగతం పలకడం నిన్నటి రామోజీరావు మనవరాలి పెళ్ళిలో హాట్ న్యూస్ గా మారింది. అంతేకాదు ఈ పెళ్ళికి ఎందరో ప్రముఖులు వచ్చినా వారందరికంటే కొంచెం ఎక్కువగా జగన్ ఈ పెళ్ళికి వచ్చిన వార్తలను ఈ టీవి ప్రసారం చేయడం వెనుక అంతర్యం ఏమిటి అన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. 

రాజకీయాలలో శాశ్విత శత్రువులు మిత్రులు ఉండరు అన్న విషయానికి ఈ సంఘటన తార్కాణమా అనే కోణంలో కూడ కామెంట్స్ వినిపిస్తున్నాయి. జగన్ ఈ పెళ్ళిలో ఉన్న కొద్ది సేపు మీడియా  కెమెరాలు అన్నీ ఆయన చుట్టూ తిరగడం మరింత షాకింగ్ గా మారింది అని అంటున్నారు. 

ఈమధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాలలో జరిగిన అతి పెద్ద ఘనమైన పెళ్ళిగా రామోజీరావు మనవరాలు సహరి వివాహన్ని పరిగణిస్తున్నారు.  సహరి-రేచన్ పెళ్లికి తెలుగురాష్ట్రాల్లో అన్ని రంగాలకు చెందిన దాదాపు అందరు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు అంతా ఒకచోట చేరడంతో ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి కలుసుకున్నారు. వీళ్లిద్దరితో కలిసి రామోజీరావు ఎక్కువ సేపు గడపడం విశేషం. టాలీవుడ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజమౌళి, పవన్,  త్రివిక్రమ్, దిల్ రాజు లాంటి ప్రముఖులు మాత్రమే కాకుండా ఎందరో ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరు అయ్యారు. అయితే ఇంతమంది ప్రముఖులు వచ్చినా జగన్ ప్రత్యేకంగా ఈ పెళ్ళికి వచ్చి అందర్నీ పలకరించడంమటుకు ప్రస్తుతానికి రాజకీయ వర్గాలలో హాట్ చర్చలకు తెర తీసింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: