ముఖ్యమంత్రి మాటలు రాష్ట్రప్రజలకు ముక్కోపాన్ని తెప్పిస్తున్నాయి.హోష్ లో ఉంటే ఇంత హేట్ గా మాట్లాడరని చిన్నపిల్లలు సైతం చీదరించుకునేలా ఉన్నాయి.             ఎవరు ఎవరిపై ఒత్తిడి తేవాలి. సమస్యల పరిష్కారానికి ప్రతిపక్షం అధికారపక్షంపై ఒత్తిడి తేవాలి.ఇది చిన్నపిల్లలను అడిగినా చెబుతారు.మరి ముఖ్యమంత్రి విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి తెస్తానంటున్నారు. ఎవరిపై తెస్తారో పాపం. కేంద్రంపై అనుకుందాం. కేంద్రసర్కారు ఏమైనా ప్రతిపక్ష పార్టీ చేతిలో ఉందా. సొంతపార్టీపైనే ఒత్తిడి తేవాల్సిరావడం వంటి దుర్బర పరిస్థితి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడైనా జరిగిందా. సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనాలను కల్పించే పార్టీలను చూసాం కాని కావాలని ఇచ్చేదానిలో కూడా కోత విధించి కష్టాలపాలు చేయడం ఎప్పుడైనా చూసామా. అంటే ఇప్పుడు చూసాం అని చెప్పాలి.               ఉదయం ఆరు గంటలనుంచి సాయంత్రం ఆరుగంటల దాక కోత విధిస్తున్నామని అధికారికంగా ప్రకటించి అమలు చేసే దుస్థితికి వచ్చాక కూడా ఇంకా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఇప్పుడు చేయడమా. పైగా అందరం కలసి కేంద్రంపై అదనపు విద్యుత్ కోసం ఒత్తిడి తెద్దాం అంటూ ముఖ్యమంత్రి మాట్లాడం ఆయన ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది. సొంత వారి నుంచే న్యాయబద్దంగా రావాల్సిన దానిని రాబట్టేందుకు ఢిల్లీ చుట్టు తిరిగి ఆయన చేసిందేమిటి. అంతా మనకే అంటూ ఇక్కడికి వచ్చి చెప్పడం తప్ప. ఆయన కేంద్ర సర్కారుకు ప్రధాన శత్రుపక్షమా అన్నది ముందు తేల్చుకోవాలి.              అందరం కలసి ఒత్తిడి తెద్దాం అంటే ఆయన అధిష్టానంపై శత్రువులతో కలసి యుద్దం చేసినట్టే కదా. ఇంతటి దయనీయ స్థితికి రాష్ట్రాన్ని తెచ్చినందుకు ఆయన నైతిక భాద్యత వహించాలి. ప్రతిపక్షానికి చెందిన ప్రభుత్వం కూడా ఇక్కడ ఉంటే తన ప్రజలను ఇంతటి ధౌర్భాగ్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా ఏమి చేయలేని తనానికి దిగిపోవాలి.               సగం భూముల్లో పంటలే వేయలేదు.వేసినవి కూడా కరెంటు కోతతో చేతికి వచ్చేలా లేవు. పరిశ్రమలు మూతపడ్డాయి,కార్మికులు పిల్లాపాపలతో వీధిపాలయ్యారు.రాతియుగంలో వలే ఆధునిక ప్రపంచంలో అంధకారంలో జనం కొట్టుమిట్టాడుతుంటే సొంతవారి నుంచి ఏమి తేలేని పాలకులు ఇంకా జనం ముందుకు రావాలా..అన్నప్రశ్నను వారే వేసుకోవాలి. కన్నపిల్లలు ఆకలితో అలమటిస్థుంటే బిక్షమెత్తి,అదీ వీలుకాకపోతే దొంగతనం,అదీ వీలుకాకపోతే మరేదేనికైనా ఒడిగట్టి ఆకలితీరుస్థారు. అలాంటిది ఆదుకునే పరిస్థితులున్నా అలమటించేలా చేస్తున్న మన పాలకులను ఏమనాలి.భవిష్యత్తు లో ప్రజలే నిర్ణయిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: