విధ్యుత్ కోత ఫలితంగా ఎండిపోయినటువంటి పంటపొలాలను టిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం శనివారం పరిశీలించనుంది. ముందుగా సిద్దిపేట – హైదరాబాద్ మద్యన దారి పొడవున ఎండినటువంటి పంటపొలాలను టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరిశీలించి రైతుల బాధలను తెల్సుకుంటారు. ఉదయం 8గంటలకు తెలంగాణ భవన్ నుండి ఎమ్మెల్యేల బృందం బయలు దేరి దారి ప్రక్కన గల ఎండినటువంటి పంట పొలాలను పరిశీలించనుంది. టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలందరు ఎండిన పంటల పరిశీలన కార్యక్రమంలో పాల్గొంటారు. విధ్యుత్ కోత కారణంగానే వరిపంటలు ఎండిపోతున్నాయనే విషయాన్ని ప్రచారం చేయడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం, ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షను వరిపంటల పరిశీలన సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ప్రచారం చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: