దేశంలో చక్రం తిప్పానని
తన భుజం తానే చరుచుకునే చంద్రబాబునాయుడు పరిస్దితి చివరకు ఇంత ఘోరంగా
దిగజారిపోయిందా ? గుంటూరులో వైసిపి
బాధితుల శిబిరం అంటూ చంద్రబాబు ఆడుతున్న డ్రామా అందరికీ తెలిసిందే కద. ఈ
శిబిరానికి టిడిపి నేతల నుండే పెద్దగా స్పందన లేదు.
అందుకనే ప్రతి జిల్లాలోని నేతలకు ఫోన్లు చేయించి మరీ బాధితుల పరామర్శకు రావాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయినా స్పందన అంతంత మాత్రంగానే ఉందనుకోండి అది వేరే సంగతి. ఇక అసలు విషయానికి వస్తే అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారు, ప్రజా సంఘాల వాళ్ళు వచ్చి తమ శిబిరాలను సందర్శించాలంటూ పిలుపిచ్చారు.
పనిలో పనిగా లోపాయికారీగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా వచ్చి శిబిరాన్ని సందర్శించమని కబురు పంపారట. పార్టీలోని కాపు నేతల ద్వారా పవన్ కు చంద్రబాబు కబురుపంపారని సమాచారం. అయితే పవన్ నుండి ఇంత వరకూ ఎటువంటి రెస్పాన్స్ రాలేదట. ఒకపుడు ఇదే పవన్ ఇదే చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకునే వాడు. మరి శిబిరం పేరుతో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలకు పవన్ ఎందుకు మద్దతుగా మాట్లాడటం లేదు ? అన్నదే అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
అసలే రాజకీయంగా కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు అజ్ఞత మిత్రుడు కూడా సాయం చేయకపోతే ఎలా ? ఎలాగైనా పవన్ ను శిబిరానికి పిలిపించాలన్నది చంద్రబాబు ప్రయత్నం. కానీ ఇప్పటికైతే సఫలం కాలేదు. అందుకనే మధ్యవర్తుల ద్వారా పవన్ పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.
అవసరమైనపుడల్లా పవన్ ను ముందు పెట్టి వెనకనుండి రాజకీయం చేద్దామని చంద్రబాబు ఎంత ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావటం లేదు. చంద్రబాబు రాజకీయమేంటో జనాలందరికీ తెలిసిందే. అందుకనే జనాలెవరూ చంద్రబాబు రాజకీయానికి స్పందించటంలేదు. అందుకని చంద్రబాబుకు ఇక ఏకైక దిక్కు పవన్ మాత్రమే. మరి ఆ విషయంలో క్లారిటితో ఉన్న చంద్రబాబు తెరవెనుక రాజకీయాలు మానేసి నేరుగానే పొత్తులు పెట్టుకుంటే బ్రతిమలాడుకునే అవసరం ఉండదు కదా ?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి