ప్రస్తుతం గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షల ప్రక్రియ జరుగుతోంది. అనేక పోస్టులకు ఇప్పటికే రాత పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాల నిబంధనలపై ఇంకా అభ్యర్థుల్లో కొన్ని సందేహాలు నెలకొన్నాయి. వాటిలో ఒకటి రిజర్వేషన్ అంశం.


ఇటీవల కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణపేదల రిజర్వేషన్ ఈ ఉద్యోగాలకు వర్తిస్తుందా.. వర్తించదా.. అనేది కొందరి అనుమానం. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది. నోటిఫికేషన్ లో ప్రకటించిన మేరకే నియామకాలు జరుగుతాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.


నియామకాలన్నీ పూర్తి పారదర్శకతతో జరుగుతాయని ఎవరూ అపోహలు నమ్మవద్దని కోరారు. పరీక్షల నిర్వహణ తీరు పై ముఖ్యమంత్రి ముఖ్య సలహదారు అజేయ కల్లాం, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ వివరాలు వెల్లడించారు .


రాత పరీక్షల నిర్వహణ పూర్తయిందని... ప్రస్తుతం ఓ ఎమ్ ఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను వేగంగా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 21 లక్షల షీట్లు స్కాన్ చేసినట్లు తెలిపారు. ఈనెల 18న మెరిట్ లిస్టు విడుదల చేస్తారు. ఇక ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి హైకోర్టులో 18 రిట్ పిటిషన్లు నమోదయ్యాయట. వీటిలో 9 రిట్ పిటిషన్లు పరిష్కారమయ్యాయట. మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు నియమకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. పరీక్షల్లో కనీస అర్హత మార్కులు సాధించిన వారికే ఉద్యోగాలిస్తామని .. అర్హత మార్కులు సాధించక పోస్టులు మిగిలిపోతే మరో సారి నోటిఫికేషన్ వేసి భర్తీ చేస్తామన్నారు. ఈ ప్రకటనతో అభ్యర్థుల్లో చాలా వరకూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: