మాజీ సభాపతి కోడెల శివ ప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు.. ఇంకా చెప్పాలంటే ఉరి వేసుకున్నారు.. ఇదీ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యుల వాదన. కోడెల మరణవార్త ప్రపంచానికి తెలిసిన తర్వాత అనేక రకాలుగా కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వాదన వెలుగులోకి వచ్చింది.


కుటుంబ సభ్యులవాదన ఇలా ఉంది.. గత కొద్ది రోజులుగా తమ తండ్రి కోడెల శివప్రసాదరావు ఒత్తిడి లో ఉన్నారట. తమకు ఈ ఘటనలో ఎవిరిపైన అనుమానాలు లేవట. ఆయన కుమార్తె చెబుతున్నదాన్ని బట్టి చూస్తే.. తన తండ్రి ఎలాంటి నోట్ రాయలేదని ఆమె చెప్పారు. ఉదయం పది గంటల సమయంలో బ్రేక్ పాస్ట్ చేసిన తర్వాత పై అంతస్తులోకి వెళ్లారని కోడెల కుమార్తె విజయ లక్ష్మి చెప్పారు.


తమ తల్లిని ఆస్పత్రికి తీసుకు వెళ్లడం కోసం తండ్రి గది వద్దకు వెళ్లగా ఆయన తలుపులు వేసుకుని ఉన్నారని విజయ లక్ష్మి వివరించారు. ఆ తర్వాత గదిలోకి చూడగా ఉరి వేసుకుని కనిపించారని ఆమె చెప్పారు. ఆ తర్వాత డ్రైవర్ గన్ మాన్ సహకారంతో బసవతారకం ఆస్పత్రికి తరలించామని ఆమె వివరించారు.


అయితే కోడెల మృతి గురించి విషయం బయటకు వచ్చిన చాలాసేపటి వరకూ బసవతారకం ఆసుపత్రి వివరణ ఇవ్వలేదు. ఆ తర్వాత మీడియాకు ఓ నోట్ విడుదల చేశారు. కోడెలను ఆసుపత్రికి దాదాపు 11న్నర ప్రాంతంలో తీసుకొచ్చారని ఆ నోట్ లో తెలిపారు. దాదాపు గంటసేపటి వరకూ ఆయన్ను బ్రతికించేందుకు ప్రయత్నించామని ఆ నోట్ లో వివరించారు.


ఆత్మహత్యాయత్నాల్లో ఉరి చాలా ప్రత్యేకమైంది. ఉరి వేసుకున్నాక బతకడం అంటూ జరగడం చాలా అరుదు. అందులోనూ ఉరి వేసుకుంటున్న సమయంలో ఎవరైనా ఆపితే చెప్పలేం కానీ.. ఎవరూ చూడకుండా ఉరేసుకుంటే మరణం ఖాయం. మరి కోడెల ఎలా బతికున్నారు. ఆసుపత్రికి తెచ్చేవరకూ ఊపిరి ఎలా ఉంది. ఈ రెండు వాదనలో ఏది నిజం. ఏమో ఆ పైవాడికే తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: