వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జనసేన మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పవన్ కళ్యాణ్ ని సీరియస్ గా టార్గెట్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అటు పవన్ కళ్యాణ్ కూడా అంతే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మాటల యుద్ధం పర్సనల్ స్థాయికి వెళ్తోంది.


మంత్రులు కన్నబాబు దగ్గర్నించి .. బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటి మంత్రులు కూడా పవన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.ఇలా వైసీపీ నేతల దాడితో ఉక్కిరిబిక్కిరైన పవన్ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. అంతకుముందు ఎప్పుడో ఒకసారి మీడియా ముందు కనిపించే పవన్ .. లాంగ్ మార్చ్ సభ తర్వాత రోజూ మీడియా ముందుకొస్తున్నారు. తాజాగా.. విశాఖ లో జరిగిన సమీక్షా సమావేశాల్లో పవన్ కల్యాణ్ జగన్ పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర రాజధా ని గురించి రాయలసీమల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి కదా.. ఉద్యమాలెందుకు.. రాజధా ని తరలించుకుని పులివెందుల్లో పెట్టుకోండి అని సలహా ఇస్తున్నారు.


అదే సందర్భంలో హైకోర్టు ను తీసుకెళ్లి కర్నూలు లో పెట్టుకోండి.. అప్పుడు మీకు పులివెందుల నుంచి కోర్టుకు వెళ్లడానికి బావుంటుంది. ఖర్చు తగ్గుతుంది అంటూ పవన్ సెటైర్ వేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. పార్టీల మధ్య విమర్శలు వ్యక్తిగత స్థాయికి వెళ్తున్నాయి. ఇది ఇరు పార్టీలకూ మంచి పద్దతి కాదు.


అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యల ద్వారా జగన్ ను అవమానపరుద్దామని భావించి ఉండొచ్చు.. కానీ ఈ కామెంట్ల ద్వారా పవన్ కల్యాణ్ మరోసారి రాయలసీమ వాసుల మనోభావాలను దెబ్బ తీశాడన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రం మొదటి రాజధాని కర్నూలే. అలాంటిది ఇప్పుడు పవన్ వ్యంగ్యంగా మాట్లాడటం విమర్శలు తావిస్తోంది. జగన్ పై కోపం ఉంటే వేరేలా మాట్లాడొచ్చు కానీ.. ఇలా సీమవాసులను కించపరచడం కరెక్టు కాదంటున్నారు సీమవాసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: