తిరుమల తిరుపతి దేవస్థానం పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ మంత్రి కొడాలి నాని పై కేసు నమోదైంది. విజయవాడ పోలీస్ స్టేషన్లో మంత్రి కొడాలి నాని పై కేసు నమోదు చేశారు పోలీసులు . హిందూ దేవాలయాన్ని కించపరిచే విధంగా కొడాలి నాని మాట్లాడుతున్నారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.. హిందూ దేవాలయాల అన్నింటిని కించపరిచే విధంగా మంత్రి కొడాలి నాని రాజకీయాలు చేస్తున్నాడు బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే స్వతహాగా క్రిస్టియన్ అయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ఇతర మతాల్ని కూడా ఎంతో గౌరవించాలి అంటూ సూచిస్తున్నారు. కానీ కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మంత్రి కొడాలి నాని మాట్లాడుతున్నారంటూ  మండిపడుతున్నాయి బ్రాహ్మణ సంఘాలు. తిరుమల తిరుపతి దేవస్థానం పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు గాను తిరుమల శ్రీవారి పాదాల పై పడి హిందూ జాతి మొత్తం కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.. 

 

 

 తిరుమల దేవస్థానం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణ సంఘాలన్ని  ముందుకు వచ్చి మరి మంత్రి కొడాలి నాని పై ఫిర్యాదు చేస్తున్నారంటూ విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో బ్రాహ్మణ సంఘాల నేత వేమూరి ఆనంద్ రావ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.గతంలో  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కూడా తిరుమలకు వెళ్లిన సమయంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై కూడా ఆరోపణలు రావడం గమనార్హం. ఇదిలా ఉండగా ఏపీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

 

 

 

 టీడీపీ అధినేత చంద్రబాబు పని అయిపోయిందని... ఇంకొన్ని రోజులు టిడిపి చంద్రబాబు చేతిలోనే ఉంటే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది...అంటూ  వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఆంధ్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతేకాకుండా పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప... పార్టీకి పూర్వవైభవం రాదంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు. టిడిపి నుంచి వైసీపీలో చేరినందుకు  తనను  తప్పు పడుతున్నారని మరి చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీ లోకి వచ్చి చేసిందేమిటి మంత్రి కొడాలి నాని నిలదీశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: