కర్ణాటకలో ఎమ్మెల్యేల అశ్లీల వీడియోలు... అసెంబ్లీలోనే పోర్న్ వీడియోలు చూసిన సంఘటనలు అక్కడ తరచూ జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే కర్ణాటక లో మాత్రమే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌ఘ‌డ్ లాంటి రాష్ట్రాల్లో సైతం బిజెపి ఎమ్మెల్యేలు ఫోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు అడ్డంగా బుక్ అవటం జరగడంతో ఆ పార్టీకి ఎక్కడలేని చెడ్డ పేరు వస్తోంది. తాజాగా కర్ణాటకలో బిజెపికి చెందిన ఓ ఎమ్మెల్యే ఓ యువతితో అశ్లీల‌మైన పని కానిస్తున్న వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

 

కర్ణాటక అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేలు ఇలాంటి విషయాలతో వార్తల్లోకి ఎక్కడం ఇప్పుడే కాదు... గత ఆరేళ్ళ క్రితమే ప్రారంభమైంది. ఆరేళ్ల క్రితం కర్ణాటక అసెంబ్లీలో అశ్లీల వీడియోలు చూస్తూ వార్తల్లోకెక్కిన బిజెపి నాయకుడు లక్ష్మణ్ స‌వాడీపై అప్పట్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అదే ల‌క్ష్మ‌ణ్ స‌వాడీకి బిజెపి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. దీనిపై మ‌హిళా సంఘాలు పెద్ద ర‌చ్చే చేశాయి. 2012లో రాష్ట్ర అసెంబ్లీలో లక్ష్మణ్‌ సవాడీతో పాటు సహచర బీజేపీ మంత్రులు సి.సి పాటిల్‌, కృష్ణ పాలేమర్‌లు పోర్న్‌ వీడియోలు చూస్తూ మీడియా కంట పడ్డారు. అది కాస్తా వైరల్‌గా మారి అప్పట్లో తీవ్ర సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.

 

ఇక తాజాగా గదగ్‌ జిల్లాకు చెందిన అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే అశ్లీల వీడియో వైరల్‌ అయ్యింది. గ‌ద‌గ్ జిల్లాలోని రోణ తాలూకా ముగళి గ్రామానికి చెందిన ఉదయ్‌ దేశాయ్‌ అనే వ్యక్తిని ఈ వీడియో విష‌య‌మై పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీశైలప్ప బిదరూరుకు ఈ ఉద‌య్ దేశాయ్ అనే వ్య‌క్తి స్వ‌యానా అల్లుడే అవుతాడు. ఎమ్మెల్యే ఓ యువతితో సన్నిహితంగా ఉండడం, అశ్లీలంగా వ్యవహరించిన వీడియో బుధవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

 

ఇది రాష్ట్ర రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. వెంట‌నే రోణకు చెందిన మంజునాథ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసిన మేరకు ఉదయ్‌ దేశాయ్‌ను అరెస్టు చేశారు. అయితే ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియో ఎప్పటిది, ఎలా జరిగిందనేది బహిరంగం కాలేదు. ఉప ఎన్నికల వేడిలోనూ ఈ అంశం హాట్‌ టాపిక్‌ అయ్యింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: