వెటర్నిటీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రియాంక రెడ్డి పై అత్యాచారం చేసి అనంతరం అతి దారుణంగా హత్య చేసిన నిందితులను  కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు వైద్యురాలు ప్రియాంక రెడ్డి దారుణ హత్య ఘటనపై  స్పందించి నిందితులకు  కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితిలో ప్రియాంక రెడ్డి హత్య ఘటనతో నిందితులకు కఠిన శిక్ష విధించాలని ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రియాంక రెడ్డి హత్య నిందితులను ఎన్కౌంటర్ చేయాలని లేకపోతే ఉరితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. 

 

 

 

 ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులను జాతీయ మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా  ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులకు సహాయం చేయకూడదని ఎంబిఎన్ఆర్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇప్పటికే దేశంలో పెరిగిపోతున్న మహిళలపై అత్యాచారాలతో  మహిళలకు రక్షణ లేదని నిరూపిస్తూ ఉండగా తాజాగా ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య దేశంలో మహిళలకు కనీస రక్షణ కరవైందని మరోసారి రుజువు చేసింది.కాగా  హైదరాబాద్ పోలీసులు కూడా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 

 

 

 

 మహిళల  రక్షణ కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వెంటనే తమకు సమాచారం అందించాలని వివిధ టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు వివిధ రకాల యాప్ లను  కూడా మహిళలకు  అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులు పోలీస్ కస్టడీలో ఉన్నారు. తమ కూతురి అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన నలుగురు నిందితులను ఉరితీయండి అలాంటప్పుడే తమ కూతురు ఆత్మ శాంతిస్తుంది అని మరోసారి ఇలాంటి దారుణ ఘటనలో సమాజంలో జరగకుండా ఉంటాయని ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: