డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం, హత్య ఘటనలో నలుగురు నిందుతులను భారీ భద్రత మధ్య చర్లపల్లి జైలుకు తరలించారు. నలుగురు దొరికితే చాలు చంపేయాలన్నంత కసితో  జనాలు ఊగిపోయారు. జనాల మూడ్ చూసిన తర్వాత నిందుతులను బయటకు తీసుకువచ్చేంత ధైర్యం పోలీసులు చేయలేకపోయారు. అందుకనే చివరకు మేజిస్ట్రేట్ ను కూడా పోలీసు స్టేషన్ కే పిలిపించారు. అంతకుముందు వైద్యులను కూడా స్టేషన్ కే పిలిపించి వైద్య పరీక్షలు చేయించారు.

 

ఉదయం నుండి షాద్ నగర్ పోలీసుస్టేషన్లోనే నలుగురు నిందుతులను పోలీసులుంచారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించే అవకాశం పోలీసులకు దొరకలేదు. ఎందుకంటే పోలీసు స్టేషన్ చుట్టుపక్కలా జనాలు పెద్ద ఎత్తున రోడ్లపైనే  కూర్చున్నారు.  వాళ్ళనన్నా బయటకు పంపాలని లేకపోతే తమనన్నా స్టేషన్లోకి అనుమతించాలన్న జనాల డిమాండ్ తో మొత్తం ఉధ్రికత పెరిగిపోయింది.

 

నలుగురు నిందుతులు ఎప్పుడు తమకు దొరుకుతారా ? లేకపోతే వారిని ఎప్పుడు బయటకు తెస్తారా ? అని జనాలు ఎదురు చూశారు. జనాల దెబ్బకు గతంలో ఎన్నడూ చూడనంతగా పోలీసు స్టేషన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దానికితోడు మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్ళాలన్నా కూడా పోలీసుల వల్ల కాలేదు.  చివరకు మధ్యాహ్నం పైన మేజిస్ట్రేట్  పాండు నాయక్ ను స్టేషన్ కే పిలిపించి విచారణ చేయించారు. చివరకు మేజిస్ట్రేట్ నిందుతులందరికీ 14 రోజుల రిమాండ్ విధించారు.

 

సరే మేజిస్ట్రేట్ తో  విచారణను  అయితే స్టేషన్లోనే చేయించారు. మరి చర్లపల్లి జైలుకు రిమాండ్ కు తరలించాలంటే ఏం చేస్తారు ? అందుకే చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పోలీసు లాంటి బలగాలను పిలిపించి మరీ నలుగురిని రిమాండ్ కు తరలించారు. ఆ సమయంలో ఒళ్ళుమండిపోయిన జనాలు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. దాంతో పోలీసులు కూడా లాఠీచార్జి జరిపి చెదరగొట్టాల్సొచ్చింది. దాంతో రెచ్చిపోయిన జనాలు రిమాండ్ కు తీసుకెళుతున్న వాహనాలపై రాళ్ళు రువ్వటంతో పరిస్ధితి కొద్దిసేపు అదుపుతప్పింది. కాకపోతే ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతో పరిస్ధితి అదుపులోకి వచ్చింది.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: