అమరావతి పై చంద్రబాబు కి ఎంత ప్రేమ ..? అక్కడ చూపిస్తున్న ప్రేమ మిగతా ప్రాంతాల్లో ఎందుకు చూపించలేకపోతున్నారు అనే మాటలు చంద్రబాబు చెవిన పడుతున్నా ఆయన మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అది అమరావతి మాత్రమే కాదు ఆంధ్రుల కలల రాజధాని అంటూ గట్టిగా చెబుతున్నాడు. అయితే బాబు ఇంత 'కమ్మ' గా అమరావతిపై ప్రేమ కనబరచడానికి కారణాలు వెనుక రహస్యాలు ఉన్నాయి అనే విషయం ప్రభుత్వం బయటపెట్టేవరకు ఎవరికీ పెద్దగా తెలియలేదు. అది తెలిస్తే బాబు బాధ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో బయటపడేది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అదే పని చేసింది. అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో లెక్కలతో సహా బయటపెట్టడంతో ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. 

 

అసలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి ఉండకపోతే అమరావతి కథ వెనుక ఉన్న నిజాలు బయటకి వచ్చి ఉండేవి కాదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎవరెవరు ఎంత ఎంత భూములు కొన్నారో అన్నీ ఆధారాలతో సహా పేర్లు బయటపడ్డాయి. వాటిల్లో బాబు సామజిక వర్గానికి చెందిన వారు, ఆ పార్టీ కీలక నాయకులు , నాలుగైదు సార్లు ఎమ్యెలేగా చేసిన వారి పిల్లలు కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండడమే కాకుండా, ఆరు కోట్ల రూపాయల విలువైన భూములను అమరావతిలో కొనడం ఇలా ఒక్కో బాగోతం బయటపడడంతో చంద్రబాబు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది. 

 


టీడీపీ ప్రభుత్వం హయాంలో తన అనుకున్న వారికి మేలుచేయడం, తమ సామజిక వర్గం వారు ఎక్కువ గా ఉండే ప్రాంతంలో వేలాది ఎకరాల భూములను రాజధాని నిర్మాణం పేరు చెప్పి లాక్కొని రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడడం ఇలా ఎన్నో అక్రమాలు అసెబ్లీ సాక్షిగా బయటపడడం, దానిని జనాలు చూడడంతో చంద్ర బాబు బాధ వెనుక ఉన్న అసలు నిజం ఏంటో అందరికి బాగా అర్ధం అయిపొయింది. ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల్లోనూ బాబు చేసిన మోసం గురించి చర్చ జరుగుతుండడం ఉన్న కాస్త పరువును కూడా పోగొట్టుకున్నట్టు అయ్యింది. 


ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ కూడా వెనక్కి తగ్గేట్టుగా లేకపోవడంతో విశాఖ, కర్నూల్ లో ముందు అనుకున్న విధంగా రాజధానుల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. దీంతో అటు అమరావతి లో పట్టు కోల్పోయామని , అలాగే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ దెబ్బతిన్నామనే బాధ ఇప్పడూ బాబులో ఎక్కువ కనిపిస్తోంది.   

 

మరింత సమాచారం తెలుసుకోండి: