జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. బిజెపితో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బహుశా తీరిగ్గా బాధపడుతూ ఉండచ్చు. ఎందుకంటే మూడు రాజధానుల విషయంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో చెప్పిన సమాధానాన్ని పవన్ ఏమాత్రం ఊహించుండరు. అందుకనే పొత్తు సమయంలో  మూడు రాజధానుల ప్రతిపాదనను నిలిపేస్తానంటూ భీకర ప్రతిజ్ఞ చేశారు. మూడు రాజధానులను అంగీకరించే ప్రశక్తే లేదని తనకు కేంద్రప్రభుత్వం చెప్పిందంటూ పెద్ద బిల్డప్ ఇచ్చాడు.

 

సీన్ కట్ చేస్తే రాజధాని అంశం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ ఇష్టమే కానీ కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. అంటే మూడు రాజధానుల అంశంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదని తేలిపోయింది. రాజధానులకు వ్యతిరేకంగా పవన్ చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. కేంద్రం తాజా సమాధానంతో పవన్ ఏం చేస్తారు ?

కమలం పార్టీతో భేషరుతుగా పొత్తులు పెట్టుకున్నట్లు స్వయంగా పవనే ప్రకటించారు. కాబట్టి ఇప్పటికిప్పుడు పొత్తును చిత్తు చేసుకుని బయటకు రాలేడు. ఎందుకంటే వచ్చి కూడా సాధించేదేమీ లేదని అందరితో పాటు పవన్ కు కూడా బాగా తెలుసు. అలాగని జగన్ రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించుకుపోతుంటే చూస్తు కూర్చోలేడు. మొత్తానికి బిజెపి-జగన్ మధ్య పవన్ భలే ఇరుక్కుపోయాడుగా.

 

జగన్ కు వ్యతిరేకంగా చేసిన భీషణ ప్రతిజ్ఞలన్నీ ఏమైపోయాయో అని జనాలు అడిగితే ఏమని సమాధానం చెబుతారు ? పోనీ బిజెపి నేతలను అయినా కన్వీన్స్ చేయగలరా ?  చాన్సే లేదు. ఎందుకంటే కమలం పార్టీతో పొత్తుపెట్టుకున్న వెంటనే  ఫిబ్రవరి 2వ తేదీన నిర్వహించాలని అనుకున్న లాంగ్ మార్చ్ ను బిజెపి నేతలు రద్దు చేయించారు. వాయిదా అని చెబుతున్నా రద్దయిందనే అనుకోవాలి. రాష్ట్ర నేతలతో సంబంధం లేకుండా  ఢిల్లీ నేతలతో మాట్లాడుకుని నిర్ణయించిన లాంగ్ మార్చ్ ను రాష్ట్ర నేతలంతా కలిసి క్యాన్సిల్ చేయించటంతో  బిజెపి ముందు తన స్ధాయేంటో పవన్ కు ఈ పాటికే తెలిసిపోయుండాలి. మరి ఏం చేస్తాడో చూడాల్సిందే.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: