వచ్చే ఏడాది నుంచి జగన్ సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్ సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై మొదట్లో టీడీపీ నానా యాగీ చేసింది. తెలుగు భాష ను చంపేస్తున్నారు బాబోయ్ అంటూ విమర్శలు గుప్పించింది. అయితే ఆ తరవాత జగన్ నిర్ణయానికి ప్రజల నుంచి సైతం మద్దతు లభించడంతో చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు. అసలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిందే మేము అనే రేంజ్ కు వచ్చేశారు.



అలా చంద్రబాబు ఖాతాలో మరో యూటర్న్ వచ్చి చేరింది. అయితే ఇప్పుడు జగన్ సర్కారు నిర్ణయానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సమర్థిస్తున్నారని, సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానాలు చేసి పంపిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన విప్లవాత్మక నిర్ణయమంటున్నారు.



రాష్ట్రంలోని 43 వేల పైచిలుకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పేరంట్స్‌ కమిటీలు ఇంగ్లిష్‌మీడియం బోధనపై అవగాహన కల్పించాయి. జగనన్న అమ్మఒడి వారోత్సవాల్లో భాగంగా జగనన్న అమ్మఒడి, నాడు – నేడు, ఇంగ్లిష్‌మీడియంపై అవగాహన కల్పించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్‌ అవసరమని ఏకాభిప్రాయంతో చెప్పారు. 43 వేల పైచిలుకు ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి వందకు వందశాతం ఆంగ్ల మాధ్యమాన్ని బోధనను పేరంట్స్‌ కమిటీలు మద్దతు తెలుపుతూ తీర్మానాలు అందించాయి.



సీఎం నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని తీర్మానాలు చేసి వాటిని ఎంఈఓలు, డీఈఓల ద్వారా కమిషనర్‌కు అందజేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న 3349 పాఠశాలల నుంచి వందశాతం తీర్మానాలు చేసి పంపించారు. చిత్తూరు జిల్లాలో సుమారు 4762 పాఠశాలలు ఉంటే వాటిల్లో 74 జీరో ఎండ్రోల్‌మెంట్స్‌ వాటిని మినహాయించుకుంటే 99.15 శాతం తీర్మానాలు చేసి పంపించారన్నారు. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మండలంలో ఉన్న 140 ప్రభుత్వ పాఠశాలలకు గానూ.. 140 పేరంట్‌ కమిటీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వందకు వందశాతం సమర్థిస్తూ తీర్మానం చేసి పంపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: