దేశవ్యాప్తంగా వచ్చే మార్చి నెలలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగే రాజ్యసభ స్థానాలు అన్ని అధికార పార్టీల ఖాతాలోనే పడనున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలను అధికార వైసిపి గెలుచుకోనుంది. అలాగే తెలంగాణలో ఎన్నికలు జరిగే అని రాజ్యసభ స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి ఖాతాలోనే పడనున్నాయి.



ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ ప్రాణాలను అధికార వైసిపి గెలుచుకోవడంతో ఆ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన మండలిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఎమ్మెల్యేల పై ఆశలు పెట్టుకున్న నేతలు ఇప్పుడు రాజ్యసభ స్థానాల పై కన్నేశారు. ఇక ఆశావహుల సంఖ్య ఎలా ఉన్నా ఈ నాలుగు రాజ్యసభ స్థానాలను ఎవరెవరికి కేటాయించాలనే దానిపై సీఎం జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.



గుంటూరు జిల్లా నుంచే ముగ్గురు నేత‌ల‌కు రాజ్య‌స‌భ స్థానాలు ద‌క్కుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిలో ఒక‌టి మంత్రి మోపిదేవి వెంట‌ర‌మ‌ణ‌కు ద‌క్క‌నుందంటున్నారు. బీసీల్లో మ‌త్స్య‌కార వ‌ర్గానికి చెందిన ఆయ‌న ఎమ్మెల్యేగా లేరు. మండ‌లి నుంచి ఎంపికై కేబినెట్‌లో ఉన్నారు. మండ‌లి ర‌ద్ద‌యితే ఆయ‌న‌కు ఇబ్బంది లేకుండా జ‌గ‌న్ ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపుతున్నార‌ట‌. ఇక టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మ‌రో బీసీ నేత బీద మ‌స్తాన్‌రావుకు కూడా రాజ్య‌స‌భ దాదాపు ఖ‌రారైన‌ట్టే..?



ఇక పారిశ్రామిక వేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి పేర్లు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే వీరిద్ద‌రు ఒకే కుటుంబానికి చెందిన వారు కావ‌డంతో పాటు ద‌గ్గ‌రి బంధువులు కావ‌డంతో జ‌గ‌న్ వీరిద్ద‌రికి రాజ్య‌స‌భ ఇస్తారా ? అన్న‌ది మాత్రం చిన్న సందేహ‌మే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: