పై ఫోటోలో అమాయకంగా కనిపిస్తున్నది ఒక కిలాడీ లేడీ. దొంగతనం చేయడంలో ఆమెను మించిన వారు ఎవరూ ఉండరని ముంబై పోలీసులే ఒప్పుకున్నారు. వివరాలు తెలుసుకుంటే... ముంబాయి మహానగరంలో క్రైమ్ క్లీన్ గా పేరు సంపాదించిన యాస్మిన్ షేక్(37) తన కెరియరుని బార్ గరల్ గా ప్రారంభించింది. అయితే బార్లని రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఆమెకు ఉన్న ఒక జాబ్ కాస్త పోయింది. అంత పెద్ద మహానగరంలో ఏ జాబ్ కోసం వెతికిన ఆమెకు మాత్రం అదృష్టం దక్కలేదు. దీంతో దొంగతనం చేసే మహిళలతో యాస్మిన్ స్నేహం చేయడం ప్రారంభించింది. అలా కొన్ని రోజుల వరకు వారితో కలిసి ఉంటూ యాస్మిన్ దొంగతనాలు చేసేది. ఒకానొక రోజు మహిళా దొంగలలో నాయకురాలు... యాస్మిన్ ని బుర్కా వేసుకోమని చెప్పింది. బుర్కా వేసుకోకపోతే వెంటనే దొరికిపోతామని సలహా ఇచ్చింది. కానీ యాస్మిన్ మాత్రం అందుకు అంగీకరించలేదు. సో, దొంగల నాయకురాలు ఆమెను బయటికి గెంటేసినది. ఇక చేసేదేమీ లేక యాస్మిన్ ఒంటరిగానే దొంగతనాలు చేయడం ప్రారంభించింది.



ఈ క్రమంలోనే జనవరి 26వ తేదీన ఒక టీచర్ కుర్లా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషనుకి వెళ్లి తన మంగళ సూత్రాన్ని ఎవరో దొంగిలించారని ఫిర్యాదు చేసింది. తాను ఒక మహిళ బోగీలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక బుర్కా వేసుకున్న మహిళ తన వెనక నిలబడిందని... ఆమె పైనే తనకి అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దాంతో పోలీసులు రైల్వే స్టేషనులోని సిసి కెమెరాలు నిశ్చింతగా పరిశీలించి టీచర్ వెనుక నిలబడిన బుర్కా మహిళ మొహం స్పష్టంగా కనిపించేలా ఒక ఫోటో తీసుకున్నారు.



అయితే ఎట్టకేలకు రెండు రోజుల క్రితం టీచర్ మంగళ సూత్రాన్ని దొంగలించిది యాస్మిన్ అని తెలిసింది. ఆమెను గోవండిలోని తన ఇంటి సమీపంలోనే పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో 5.5తులాల బంగారం ఆమె ఒంటిపై దొరికింది. స్టేషనుకు తీసుకువెళ్లి తమదైన శైలిలో ఆమెను విచారించగా... ఆమె దొంగతనం చేసి కూడబెట్టిన సొమ్ము గురించి తెలిసింది. దీంతో రైల్వే పోలీసులు ఆమె ఉంటున్న విలాసవంతమైన ఇంట్లో అడుగడుగున వెతకగా రూ.8 లక్షలతో పాటు లక్షల విలువచేసే బంగారం దొరికింది. కిచెనులో ఉన్న ఏ టిఫిన్ బాక్స్ తెరిచి చూసిన అందులో బంగారం లేదా డబ్బుల కట్టలు దర్శనమై పోలీసులని ఆశ్చర్యపోయేలా చేశాయి. ఆమె ఇంట్లో దొరికిన సెల్ ఫోన్ల సంఖ్య వందలో ఉందని పోలీసులు తెలిపారు. అలాగే గోవండిలో ఆమె ఉంటున్న ఇంటిని అక్షరాలా రూ.16 లక్షలతో కొనుగోలు చేసిందని పోలీసుల తెలుసుకున్నారు.



పట్టుబడకుండా ఇన్నిరోజులు ఇంత సొమ్ము ఎలా దొంగలించావ్ అని ఆమెను ప్రశ్నించగా... 'నేను ఒక పసిబిడ్డని ఎత్తుకొని ఏదైనా రద్దీగా ఉన్న మహిళా కంపార్ట్మెంట్లో ఎక్కుతాను. ఆ తర్వాత బిడ్డ ఏడుస్తుంటే బుజ్జగించినట్లు నటిస్తూ నా చేతులను దగ్గర ఉన్న మహిళల హ్యాండ్ బ్యాగులలో లేదా మెడలోని చైనులపై వేసి కొట్టేస్తాను. ఆపై నెక్స్ట్ స్టాప్ లో దిగి పోతాను', అని తన దొంగతనం స్టైల్ ని వివరించింది. 53 కేసులలో నిందితురాలిగా ఉన్న ఈమె తన మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకుని చాలా రోజులకు తప్పించుకుంది. యాస్మిన్ కి రెండు సార్లు పెళ్లి అవ్వగా ఆమెకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: