ఆంధ్ర రాజకీయాల్లో  2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ భారీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవి చేపట్టక ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే మొన్నటికి  మరో సంచలన నిర్ణయం తీసుకొని ఐపీఎస్ సీనియర్ అధికారి ఏబి  వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. భద్రత పరికరాల కొనుగోళ్లు లో అక్రమాలకు పాల్పడ్డాడని... అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా లీక్ చేశాడని అభియోగాలు మోపుతూ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయనను సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి విచారణ పూర్తయ్యేంతవరకు రాష్ట్రాన్ని దాటి పోకూడదు అంటూ తెలిపింది. 

 


 అయితే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ని సస్పెండ్ చేయడం సంచలనం గా మారిన విషయం తెలిసిందే. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి  వెంకటేశ్వరరావు ను  జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది ప్రతిపక్ష టిడిపి పార్టీ ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు ముఖ్యమంత్రి కావడానికి ముఖ్య కారణమైన ఏబి  వెంకటేశ్వరరావును ... సస్పెండ్ చేయడం ఏంటి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో అందరిలో సరికొత్త ప్రశ్న నెలకొంది. జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఏబీ వెంకటేశ్వరరావు కారణం ఏమిటి అనే దానిపై అందరిలో ఆలోచన మొదలైంది. 

 


 అయితే చంద్రబాబు అలా అనడానికి కారణం ఏమిటి అంటే... 2019 ఎన్నికలకు ముందు... చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ తో పాటు బీజేపీ మద్దతు కూడా కూడగట్టుకొని ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలు కలిసి 2019 ఎన్నికలకు ముందు పోటీ చేస్తే భారీ మెజారిటీ దక్కుతుందని భావించారు. దీనిపై చర్చలు జరిపేందుకు చంద్రబాబు టీడీపీ  కీలక నేతలను పంపుతున్న సమయంలో ఏబి  వెంకటేశ్వరరావు ఏబీఎన్ రాధాకృష్ణ లు అడ్డు పడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే ఈ పొత్తు కాస్తా కుదరలేదని ఒకవేళ ఈ పొత్తు కుదిరే ఉంటే... వైసిపి పార్టీ అంతటి ఘన విజయాన్ని సాధించేది  కాదని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యే వాడు కాదని ఆ కోపంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసిన ఏవి వెంకటేశ్వరరావు ని సస్పెండ్ చేస్తారా అనే వ్యాఖ్యలు చేశారు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: