యువతీ యువకులు యుక్త వయస్సుకు వచ్చాక ఆకర్షణకు లోనవడం ప్రేమలో పడటం.. పెళ్లి చేసుకోవడం కామన్. కానీ అన్ని ఆకర్షణలూ ప్రేమలుగా మారవు.. అన్ని ప్రేమలూ పెళ్లిళ్లుగా మారవు. కొంత మందివి కేవలం ఆకర్షణ వరకే ఆగిపోతాయి. ఐదు నిమిషాల లైంగిక సుఖం కోసం ఆవురావురుమంటారు.. ఆ పని అయిపోయాక బై బై చెప్పేసుకుంటారు.

 

 

అయితే ఇలాంటి కేసుల విషయంలో ఇబ్బంది లేదు. ఇద్దరికీ ఇది ఆకర్షణే అని నమ్మకం ఉన్నప్పుడు ఏదో నాలుగు రోజులు ఎంజాయ్ చేస్తారు.. తర్వాత ఎవరి దారి వారు చూసుకుంటారు. కానీ.. ఒకరు దాన్ని ఆకర్షణగా మరొకరు దాన్ని ప్రేమగా ఫీలైనప్పుడే ఇబ్బంది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు దాన్ని ప్రేమ అనుకుంటారు. అబ్బాయిలు దాన్ని ఎంజాయ్ మెంట్ అనుకుంటారు.

 

IHG

 

అందుకే.. ప్రేమ పేరుతో లొంగదీసుకుని.. నాలుగు రోజులు ఎంజాయ్ చేశాక ముఖం చాటేసే కేసులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి విషయాల్లో ఎక్కువగా అమ్మాయి మోసపోతుంటారు. అయితే ఇక ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఓ కొత్త రూల్ రాబోతోంది. ఒక్కసారి అమ్మాయి, అబ్బాయి లైంగికంగా కలిస్తే చాలు.. చట్టపరంగా వారి వివాహం అయిపోయినట్టే..

 

 

ఈ మేరకు రాజ్యాంగంలోనూ మార్పులు చేస్తున్నారట. ఈ వివాహాన్ని హెటిరోసెక్సువ‌ల్ యూనియ‌న్‌గా గుర్తిస్తారట. అయితే అప్పుడే కంగారు పడకండి. ఇది మనదేశానికి సంబంధించిన విషయం కాదు.. రష్యాకు సంబంధించింది. ఈ కొత్త రూల్ కోసం రష్యా అధ్యక్షుడు రాజ్యాంగ సవరణలను పార్లమెంటుకు ప్రతిపాదిస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చలు జ‌రిపిన త‌ర్వాతే ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్టిన‌ట్లు ఆ దేశ పార్లమెంట్‌ స్పీక‌ర్ వ‌చ‌స్లేవ్ వోలోడిన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: