ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను మరణ భయం తో వణికిస్తున్న విషయం తెలిసిందే. చైనాలోని మహానగరంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్... ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా వ్యాప్తిచెందిన బిబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాణాంతకమైన వైరస్ కి  సరైన వ్యాక్సిన్ కనుగొనడానికి అటు  ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు. అయితే ఈ కరోనా  తెర మీదికి వచ్చి ఇప్పటికే రెండు నెలలు గడిచి పోతుంది.అయినప్పటికీ ఈ ప్రాణాంతకమైన వైరస్ కి సరైన వ్యాక్సిన్ మాత్రం కనుగొనలేకపోయారు. అయితే తాజాగా ఈ వైరస్ భారత్ కి కూడా ప్రవేశించి అందరిని బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. 

 


 ఇప్పటికే ఇండియా ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... శర వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ  ప్రాణాంతకమైన మహమ్మారి. ప్రస్తుతం ఇండియాలో 28 మంది ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. దీంతో ఇండియా మొత్తం ఈ ప్రాణాంతకమైన వైరస్ పేరెత్తితేనే ప్రాణ భయంతో వణికిపోతుంది. అయితే రోగనిరోధక శక్తిని పెంచుకోవటం  ద్వారా కరోనా  వైరస్ ను  తట్టుకునే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ప్రాణాంతకమైన వైరస్ కారణంగా భయభ్రాంతులకు గురవుతున్న వేళ అటు ఆధునిక వైద్యంలో ఇంకా దీనికి విరుగుడు దొరకలేదు. 

 

 కానీ సాంప్రదాయ ఆయుర్వేదంలో మాత్రం చిన్న చిట్కాలతో నే ఈ ప్రాణాంతకమైన వైరస్ కు దూరంగా ఉండవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలుగునాట ఆయుర్వేద వైద్యుడిగా మంచి పేరు సంపాదించిన డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్ ప్రాణాంతకమైన కరోనా  వైరస్ బారిన పడకుండా ఉండేందుకు పలు చిట్కాలను వెల్లడించారు. ఓ వీడియో ద్వారా ఈ చిట్కాలను వెల్లడించారు ఆయుర్వేదిక వైద్యుడు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీమోహన్. కరోనా తో భయపడాల్సిన అవసరం లేదని.. రోగ నిరోధక శక్తి పెంచుకుంటే కరోనా వైరస్ ని ఎదుర్కోవడం సులభం అని చెబుతున్నారు. ఇంతకీ ఈ డాక్టర్ ఏం చెప్పాడో ఒకసారి వీడియో లోకి వెళ్లి చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: