ప‌సుపులేటి బాల‌రాజు. మాజీ మంత్రి. గ‌తంలో కాంగ్రెస్ లో ఉండ‌గా.. మంత్రిగా చ‌క్రం తిప్పారు. ఎస్టీ వ‌ర్గా నికి చెందిన బాల‌రాజు.. గ‌త ఎన్నిక‌ల్లో పాడేరు నుంచి జ‌న‌సేన టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ త ర్వాత రాజ‌కీయంగా స్తబ్దుగా ఉన్న ఆయ‌న ఇప్పుడు అధికార వైసీపీలోకి చేరిపోయారు. వాస్త‌వానికి ఎన్నిక ల‌కు ముందు వైసీపీ నుంచి ఆహ్వానం అందినా, ఆయ‌న మౌనంగా ఉండిపోయారు. దీంతో ఇక్క‌డ కె.భాగ్య ల‌క్ష్మి విజ‌యం సాధించారు. అయితే, పార్టీ మారినా కూడా బాల‌రాజుకు  క‌ష్టాలు తీర‌లేద‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు.



జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఎస్టీ మహిళలకు రిజర్వు కావడంతో తన కుమార్తె డాక్టర్‌ దర్శినికి గూడెంకొత్తవీధి జడ్‌పీటీసీ నుంచి వైసీసీ తరపున బరిలో దింపాలన్న ఉద్దేశంతో బాలరాజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ క్ర‌మంలో ఆయ‌న కోరిక‌ను మ‌న్నించి వైసీపీ కూడా ఆయ‌న కుమార్తెకు టికెట్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఆమె హుటాహుటిన విశాఖపట్నం వెళ్లి, బాలరాజు చేరికను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి వద్ద పంచాయితీ పెట్టారు.



జీకేవీధి జడ్‌పీటీసీ టిక్కెట్లును బాలరాజు కుమార్తెకు కేటాయించవద్దని విన్నవించుకున్నారు.  ఇదిలావుంటే, భాగ్య‌లక్ష్మి సిఫారసు చేసిన అభ్యర్థికి కాకుండ గతంలో పాడేరు సమన్వయకర్తగా పనిచేసి, ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు భార్య శివరత్నానికి జడ్‌పీటీసీ టిక్కెట్టు కేటాయించారు. ఈ పరిణామంతో బాలరాజు వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే పదవుల కోసం వైసీపీలో చేరలేదని, పార్టీ విధానాలు, జగన్‌ పరిపాలన నచ్చి పార్టీలో చేరామంటూ బాలరాజు  చెబుతున్నారు. కానీ, ఆయ‌న పార్టీ మారిన‌ప్ప‌టికీ.. అనుకున్న‌ది సాధించ‌లేక పోయార‌నే ప్ర‌చారం మాత్రం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు బాల‌రాజుకు వైసీపీ నుంచి అర‌కు ఎంపీ సీటు ఆఫ‌ర్ చేసినా తీసుకోలేదు. ఇప్పుడు ఆయ‌న ఆశ‌లు రివ‌ర్స్ అయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: