ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు నిర్భయ కేసులో నలుగురు నిందితులను తీహార్ జైలు అధికారులు ఉరి తీసిన విషయం తెలిసిందే. గత ఏడేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న నిర్భయ నిందితులకు ఉరి కి మార్గం సుగమమైంది. ఇప్పటి వరకు ఎన్నో సార్లు కోర్టులో నిర్భయ నిందితులకు కేసు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నోసార్లు కోర్టులు  ఉరిశిక్షలు విధించినప్పటికీ సరికొత్త ట్విస్ట్  తెరమీదికి తెస్తూ  ఉరిశిక్ష వాయిదా పడేలా చేశారు నిర్భయ నిందితులకు. దాదాపు ఏడేళ్ళ తర్వాత వారికి ఉరిశిక్ష అమలు అయింది. చట్టపరంగా నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉన్న అవకాశాలని వినియోగించుకున్నారు. 

 


 ఇక అవకాశాలన్నీ అయిపోవడంతో తీహార్ జైల్లో ఉరికొయ్యకు వేలాడక తప్పలేదు. నిర్భయ నిందితుల ఉరి తో కాస్త ఆలస్యమైనా న్యాయమే విజయం సాధిస్తుంది అని మరోసారి నిరూపితమైంది. ఇక దేశం మొత్తం గత ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరి  అమలు కావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నేళ్ల  పాటు న్యాయ పోరాటం చేసిన నిర్భయ తల్లిదండ్రుల కష్టానికి ఫలితం లభించింది . అయితే నిర్భయ నిందితులను నిబంధనల ప్రకారం 30 నిమిషాలపాటు ఉరి తీసారు... ఆ తర్వాత నలుగురు మృతదేహాలను జైలు నిబంధనల ప్రకారం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మృతదేహాలను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ నలుగురు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం... కుటుంబ సభ్యులను పిలిపించి నిర్భయ కేసులో నలుగురు నిందితులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. 

 


 ఒకవేళ నిర్భయ కేసులో నలుగురు నిందితులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లి అంత్యక్రియలు జరిపేందుకు నిరాకరిస్తే.. వారి మృతదేహాలకు జైలు అధికారులే అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జైలు శిక్ష అనుభవించిన సమయంలో  జైలులో పనిచేసి నలుగురు నిందితులు సంపాదించిన డబ్బు మొత్తాన్ని వారి వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు అధికారులు. అయితే నిర్భయ కేసులో నిందితులకు ఉరి అమలుకు ముందు వారిలో తీవ్ర భయం కనిపించిందని జైలు అధికారులు తెలిపారు. వారి చివరి కోరిక తెలపడానికి గానీ... లేదా దేవుని ప్రార్ధించడానికి గానీ వారు నిరాకరించారు అంటూ  జైలు అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: