పెళ్లి చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారి పోయింది. చివరికి పెళ్లి కార్డే  ఆమెకు సూసైడ్ నోట్ గా మారింది. భర్త చేసిన మోసాన్ని చెప్పిన అబద్ధాన్ని తట్టుకోలేక తనువు చాలించింది. తమ కూతురు పెళ్లి జరిగింది అని తల్లిదండ్రుల ఆనందాన్ని రోజులు కూడా గడవకముందే తీరని శోకం గా మార్చేసింది. మంచి ఉద్యోగం చేస్తున్నాను అటు భర్త పెళ్లికి ముందు మాయ మాటలు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకున్నాడని తెలిసి మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టిక్కల్  లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... హైదరాబాద్ శివార్లలో ఐదెకరాల భూమి ఉందని.. విదేశాల్లో గొప్ప ఉద్యోగం ఉందని... పెళ్లికి ముందు మాయమాటలు చెప్పి ఓ యువతిని నమ్మించి పెళ్లి చేసుకున్న భర్త తనను పెళ్లి చేసుకున్నాడనే  విషయం తర్వాత తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి తనువు చాలించింది. 

 

 

గట్టికల్  కు చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు కూతుర్లు ఉండగా... పెద్ద కూతురు సీఏ  పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తుంది. దీంతో మౌనిక కు పెళ్లి చేయాలని భావించారు తల్లిదండ్రులు. మంచి ఉద్యోగం మంచి నడవడిక ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన సాయికిరణ్ రెడ్డి... విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నానని  హైదరాబాద్లో కూడా ఐదెకరాల స్థలం ఉంది అని మౌనిక తల్లిదండ్రులను నమ్మించాడు. దీంతో తమ కూతురికి మంచి సంబంధం దొరికిందని తల్లిదండ్రులు ఆనందపడ్డారు. సాయి కిరణ్ రెడ్డితో ఈ నెల 15న సూర్యపేట లో ఘనంగా వివాహం జరిపించారు.

 

 

 ఇక కట్నకానుకలు కూడా భారీగానే ముట్ట  చెప్పారు. అయితే పెళ్లి జరిగి అత్తారింటి లోకి అడుగుపెట్టింది నవవధువు. ఇంతలో కూతురుని  చూద్దామని వెళ్లారు తల్లిదండ్రులు. కానీ వారికి భారీ షాక్ తగిలింది. తన కూతుర్ని పెళ్లి చేసుకున్న సాయి కిరణ్ కి ఎలాంటి జాబ్ కానీ భూమి కానీ లేదు అంటూ తెలిసింది. దీంతో ఆగ్రహానికి లోనైన మౌనిక తల్లిదండ్రులు వారి బంధువులను నిలదీయగా వారికి అక్కడ అవమానం ఎదురైంది. మౌనిక తో పాటు ఆమె తల్లిదండ్రుల పై సాయికిరణ్ రెడ్డి కుటుంబీకులు దాడిచేసి గెంటేశారు. అయితే అయితే భర్త చేసిన మోసం మెట్టింటి వారు చేసిన అవమానం తట్టుకోలేక పోయిన మౌనిక.. తన పెళ్లి కార్డు పై  సూసైడ్ నోట్ రాసి  ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: