కరోనా కట్టడి కోసం వైఎస్ జగన్ సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది. జగన్ నిరంతరం సమీక్షలు చేస్తున్నారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నారు. అయితే కరోనా పై ప్రభుత్వం తగిన రీతిలో స్పందించడం లేదంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ ప్రకటనల ద్వారా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలకు వైసీపీ నేతలు కూడా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు.

 

 

ఈ విమర్శలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా రియాక్టయ్యారు. రాష్ట్ర ప్రజలంతా కరోనాతో పోరాడుతుంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు మాత్రం హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే.. వారిని అవమానించే రీతిలో హైదరాబాద్‌లో కూర్చొని ప్రకటనలు ఇస్తున్నారని మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీచ రాజకీయాలు మానుకోవాలని పవన్‌, చంద్రబాబులకు మంత్రి వెల్లంపల్లి సూచించారు.

 

 

ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ప్రభుత్వాన్ని కించపరిచేలా చేయాలని చూడటం సరైన విధానం కాదని మంత్రి వెల్లంపల్లి హితవు పలికారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం, బ్రిటన్‌ లాంటి దేశాలు కూడా వలంటీర్లను నియమిస్తున్నాయని వెల్లంపల్లి అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి సీఎం వైయస్‌ జగన్‌ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రజలు నిత్యావసరాలపరంగా, ఇతర అంశాలలో ఇబ్బంది పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి వెల్లంపల్లి వివరించారు.

 

 

నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా ప్రతి ప్రాంతంలో రైతుబజార్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. విజయవాడలో గతంలో ఐదు రైతుబజార్లు ఉంటే ఈరోజు 45 రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: