భారతదేశంలో ప్రతి ఒక్కరిలో కరోనా  భయమే కనిపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఎవరితో మాట్లాడిన అంతా ప్రాణాంతకమైన కరోనా  వైరస్ భయం. ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో తెలీదు కానీ వస్తే మాత్రం ప్రాణాలను హరించుకుపోతుందేమో అని భయం. అంత భయం భయం. కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే భయం. ఇక భారత దేశంలో రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. ప్రజలందరినీ ఇంటికే పరిమితం అయ్యేలా కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ ఎక్కడ మార్పు  మాత్రం కనిపించడం లేదు. 

 

 

 రోజురోజుకు భారత్లో విలయతాండవం చేస్తున్న కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఇక అటు ప్రజల్లో కూడా రోజురోజుకీ ప్రాణభయం పాతుకు పోతుంది. ఇక కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు పాటించడం కాదు... కరోనా  దరిచేరకుండా తీసుకునే జాగ్రత్తలు కూడా మితిమీరిపోతున్నాయి. ముఖ్యంగా పక్కన ఉన్న వాళ్ళు ఒక్కసారి దగ్గితే  చాలు ఇక ప్రాణభయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పక్క వాళ్ళు తుమ్మినా దగ్గినా కాస్త జ్వరంగా  అనిపించినా... కరోనా  సోకినట్లు నిర్ధారణ చేస్తున్నారు పక్కనే ఉన్న వాళ్ళు. దీంతో వారి పక్కన ఉండాలి అన్నా లేదా వారివైపు కన్నెత్తి చూడాలి అన్న భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

 

 

 ఇక్కడ కరోనా  వైరస్ ఏకంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసింది. కరోనా  వైరస్ వచ్చి కాదు... కేవలం తనకు కరోనా  వైరస్ సోకిందదేమో అని అనుమానం తోనే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తికి కరోనా  వైరస్ సోకిందేమో అనే భయంతో సామాజికంగా అతనిని బహిష్కరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి... ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హిమాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉన్నా జిల్లాలోని బంగర్  గ్రామంలో ఓ వ్యక్తి కరోనా  వైరస్ లక్షణాలు ఉండడంతో డాక్టర్లు అతని పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని రావడంతో మళ్లీ గ్రామంలో వదిలేసారు. కానీ ఊరి ప్రజలు కరోనా  వైరస్ పై నెలకొన్న భయం కారణంగా సామాజికంగా ఆ వ్యక్తిని ఊరు నుండి బహిష్కరించడంతో మనస్థాపానికి గురై ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: