ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో రోజురోజుకీ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. క‌రోనా దెబ్బకు అమెరికాలో ప్రతీ రెండున్నర నిమిషాలకు ఓ మరణం సంభవిస్తోంది. న్యూయార్క్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దేశంలో ఇప్పటి వరకు ప‌ది వేల మందికిపైగా మృత్యువాత పడగా, ఒక్క న్యూయార్క్‌లోనే 4,758 మంది మృతి చెందారు. ఇదిలా ఉండే.. అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. 

 

అయితే మలేరియా నివారేణకు యూజ్ చేస్తున్న ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. అది కూడా ట్రంప్ కాల్ చేసి తమకు ఈ డ్రగ్ కావాలని కోరిన‌ ముందు రోజే భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే.. భార‌త్ సైతం ఇదే మందు త‌మ‌కు అవ‌స‌రం అని భావిస్తోంది. ఇక భార‌త్ నిర్ణ‌యంతో ట్రంప్ తీవ్రంగా ర‌గిలిపోతున్న‌ట్టు తెలుస్తోంది. మోదీని హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ఫోన్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన ట్రంప్.. ఆ ప్రతిపాదన ఫలించకపోవడంతో ఇండియాపై వాణిజ్య అంశాల్లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

కరోనా వైరస్ త‌గ్గుముఖం ప‌డితే ట్రంప్... భారత్‌‌పై భారీగా వాణిజ్యం సుంకాలు వేస్తారనే అభిప్రాయం సైతం వెల్లడవుతోంది. ఇదే స‌మ‌యంలో ``భారత్ గనగ తమ ప్రతిపాదనకు ఒప్పుకుంటే మంచిదే, ఒకవేళ ఒప్పుకోకపోతే... అయినా పర్వాలేదు మాకు... కానీ దానికి ప్రతీకారం ఉంటుంది`` అని వైట్ హౌస్ దగ్గర ట్రంప్ చేసిన వ్యాఖ్యల ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో క‌రోనాని కంట్రోల్ చేయ‌లేక‌.. భారత్ లాంటి దేశాల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక వాస్త‌వానికి అమెరికాకు డ్రగ్ సరఫరా కొనసాగించాలా.. వద్దా.. అనే అంశంపై భారత్ ఇంకా చివ‌రి నిర్ణయం తీసుకోలేదు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: