ఇండియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇతర దేశాలతో పోలిస్తే .. కొంతలో కొంత బెటర్. అయితే కొందరు నిపుణులు... దేశంలో తగినంతగా టెస్టులు జరగడం లేదని.. టెస్టుల సంఖ్య పెరిగితే కేసులు పెరుగుతాయని చెబుతున్నారు. ఏప్రిల్ 12వరకూ జరిగిన టెస్టులు, పాజిటివ్ కేసులను పరిశీలిస్తే... పరిస్థితి అర్థమవుతుంది. ప్రస్తుతం దేశం టెస్టింగ్ ఫర్ మిలియన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 

దేశంలో రాష్ట్రాలన్నింటిపైనా మానిటర్ చేసి, వివరాలు చెప్పగలిగిన కేంద్ర వ్యవస్థ మనదగ్గర లేదు. మాన్యువల్ ఇన్స్‌పెక్షన్ చేసి , హెల్త్ బులెటిన్‌ల ద్వారా ఏప్రిల్ 12వరకూ ఇచ్చిన వివరాల ఆధారంగా రూపొందిన స్టాటిస్టిక్స్ ఇవి. ఈవిధానంలో రాష్ట్రాలను .. మూడు కాలమ్స్‌గా విభజించారు... విస్తీర్ణం, జనసాంద్రతలో చిన్నగా ఉన్న రాష్ట్రాలను మొదటి కాలమ్, మధ్యగా ఉన్నవి రెండో కాలమ్, పెద్ద రాష్ట్రాలను మూడో కాలమ్‌లో వేశారు. వీటి పనితీరును బట్టి నాలుగు క్వాడ్రంట్స్‌గా విభజించారు. మొదటిది ఎక్కువ టెస్టింగ్ శాంపిల్స్ తక్కువ పాజిటివ్ కేసులు, రెండోది ఎక్కువ టెస్టులు.. ఎక్కువ కేసులు, మూడోది తక్కువ టెస్టులు, తక్కువ కేసులు, నాలుగోది తక్కువ టెస్టులు, ఎక్కువ కేసులు నమోదు చేసినవి.

 

తొలి కాలమ్‌లో ఈశాన్య రాష్ట్రాలు, చండీగడ్, గోవా, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. వీటిని నిశితంగా పరిశీలిస్తే.. ఇందులో అండమాన్ నికోబర్ దీవులు... విస్తీర్ణం, జనాభాలో తక్కువ శాతం ఉండడంతో... ఇక్కడ టెస్టుల నిర్వహణ సమర్థంగా చేయవచ్చు.  రెండో అతి ఎక్కువ టెస్టులు చేసింది కూడా ఇక్కడే. చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో తక్కువ టెస్టులు చేయగా.. ఎక్కువకేసులు నమోదయ్యాయి.

 

రెండో కాలమ్న్‌ పరిశీలిస్తే.. 11 నుంచి 37 మిలియన్ జనాభా ఉన్న మీడియం రాష్ట్రాలు. ఇందులో కేరళ.. అద్భుతంగా కరోనాను నియంత్రించ గలుగుతోంది. ఇక్కడ 14వేల 989 టెస్టులు నిర్వహించగా.. 375 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వచ్చిన పేషెంట్లకు చక్కగా చికిత్స చేస్తున్నాయి. తర్వాతి ఢిల్లీ 14 వేల 36 టెస్టులు చేయగా.. 1154 కేసులు నమోదయ్యాయి. ఎక్కువటెస్టులు చేయగా.. ఎక్కువ కేసులు నమోదైనట్లు గుర్తించారు. అసోం, జార్ఖండ్ రాష్ట్రాల్లో తక్కువ టెస్టులు చేయగా.. తక్కువ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో 1 క్వాడ్రంట్‌లో కేరళ, రెండో క్వాడ్రంట్‌లో ఢిల్లీ మిగిలిన రాష్ట్రాలు మూడో క్వాడ్రంట్‌లో ఉన్నాయి. 

 

మూడో కాలమ్‌ విషయానికొస్తే..ఇందులో ఉన్నవన్నీ పెద్ద రాష్ట్రాలే. ఈ రాష్ట్రాల్లోనూ రాజస్థాన్‌ అద్బుత పనితీరు కనబరుస్తోంది. మహారాష్ట్ర తర్వాత అధిక కేసులు నమోదైనప్పటికీ.. ఇదితొలి క్వాడ్రంట్‌లో నిలిచింది. ఇక అత్యధిక టెస్టులు నిర్వహించిన మహారాష్ట్రలో.. అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇది రెండో క్వాడ్రంట్‌లో నిలిచింది. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాలు మూడో క్వాడ్రంట్‌లో నిలిచాయి. తమిళనాడు మాత్రం తక్కువ టెస్టుల్లో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు చేసి.. క్వాడ్రంట్ 4కు చేరువవుతోంది.

 

ఇండియాలో ప్రస్తుతం ఢిల్లీ మర్కజ్ లింక్స్‌తోనే ఈ కేసుల సంఖ్యపెరిగిపోయింది. ఇది తప్ప అంత పెద్దది మరొకటి లేదు. యాంటీ బాడి టెస్ట్ కిట్స్ ను ఉపయోగిస్తే.. కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా అడ్డుకోవచ్చంటున్నారు. ఇండియాలో లాక్ డౌన్ కారణంగా వైరస్ వ్యాప్తి కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ స్టేజికి చేరలేదు. అయితే ఇండియా లాక్ డౌన్ ను ఎక్కువరోజులు భరించలేదు. లాక్ డౌన్స్ కేవలం సర్క్యూట్ బ్రేకర్స్ మాత్రమే..  టెస్టింగ్ కవరేజ్ పెంచడం  ద్వారా హాస్పిటల్స్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: