దేశంలో నానాటి కీ పెరిగిపోతున్న కరోనా ని కట్డడి చేయడానికి గత నెల 24 నుంచి లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నిన్న ప్రధాని మోదీ మే 3 వరకు లాక్ డౌన్ పెంచుతున్నామని.. కరోనాని నిర్మూలించేందుకు అందరూ ఆరోగ్యంగా ఉండేది ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు.  అయితే కొంత మంది లాక్ డౌన్ ఉల్లంఘిస్తూనే ఉన్నారు.  లాక్ డౌన్ నిబంధనలను దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు ఉల్లఘిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.  నిబంధనలు కేవలం సామాన్యులకేనన్నట్టుగా నేతలు ప్రవర్తిస్తున్నారు.

 

పుదుచ్చేరిలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి... జనాలకు బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా పాల్గొన్నారు.  నెల్లితోపీ గ్రామంలో ఎమ్మెల్యే జాన్ కుమార్ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బియ్యం పంపిణీ చేశారని, ఈ సందర్భంగా ప్రజలు సామాజిక దూరం పాటించకుండా గుంపుగా చేరారని రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

దీంతో పుదుచ్చేరి పోలీసులు ఎమ్మెల్యే జాన్ కుమార్ పై ఐపీసీ సెక్షన్ 188, 269, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ల కింద కేసు నమోదు చేశారు. జాన్ కుమార్ పై ఈ విధమైన కేసు నమోదు కావడం ఇది రెండో సారి. గతంలో కూడా ఆయన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఇంటి ముందు  దాదాపు 200 మందికి కాయగూరలు పంపిణీ చేశారు.  జాన్ కుమార్ పై గతంలోనూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదైంది. రెండోసారి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: