దేశంలో గత నెల నుంచి కరోనా వైరస్ ప్రభావం చూపుతూ వచ్చింది.  ఈ నేపథ్యంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  దాంతో ఇతర దేశాలతో పోల్చితే కొంత మేరకు భారత్ నయమే అనిపించినా.. ఇక్కడ పదివేల కేసులు నమోదు అయ్యాయి. అయితే కరోనా ఇంకా తగ్గని కారణంగా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.  తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను రంజాన్ మాసం(మే 24) ముగిసేవరకు పొడిగించాలని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఛాన్సలర్, ముస్లిం యాక్టివిస్ట్ ఫిరోజ్ బఖ్త్ అహ్మద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

 

వివిధ రాష్ట్రాల్లో డాక్టర్లు, పోలీసులు,హెల్త్ కేర్ వర్కర్లపై కొంతమంది ముస్లింలు ప్రవర్తించిన తీరుకు ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే రంజాన్ మాసం నేపథ్యంలో  భారీగా ఇఫ్తార్ విందులు ఏర్పాట్లు చేస్తారు.ఒకవేళ మే 3న లాక్ డౌన్ ఎత్తివేస్తే.. అత్యుత్సాహంతో ముస్లింలు రద్దీ మార్కెట్లు, భారీ ఇఫ్తార్ విందులు, ఎక్కువమందితో ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఇది మళ్లీ ప్రమాదానికి దారి తీయవొచ్చని ఆయన లేఖలో పేర్కొన్నారు.

 

చట్టాన్ని గౌరవించే భారతీయ ముస్లింగా, భారతదేశంలో నిర్బంధంలో ఉన్న నా సమాజానికి చెందిన వారందరి తరపున క్షమాపణలు కోరుతున్నాను.ఈ నేపధ్యంలోనే రంజాన్ చివరి వరకు అనగా మే 24 వరకు లాక్ డౌన్ ఎత్తివేయకుండా అమలు చేయాలని అన్నారు. అలాగే  కొంతమంది ముస్లింలు ఉమ్మివేయడం, ఆసుపత్రి సిబ్బంది ఇబ్బంది పెట్టడంపై బాధపడుతున్నామని అహ్మద్ లెటర్‌ లో కోరారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: