కరోనా వైరస్ వ్యాధి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ పనుల నిమిత్తం వెళ్ళిన వారందరూ ఎక్కడికక్కడ నిర్బంధం లోకి వెళ్లి పోయిన విషయం. ఎలాంటి రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంతో చాలా మంది వలస కార్మికులు తమ తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా ఈ లాక్ డౌన్  కారణంగా ముంబై లో చిక్కుకున్న ఓ యువకుడు ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ సమీపంలో ఉన్న తన స్వగ్రామానికి వెళ్ళాలి అనుకున్నాడు. లక్ డౌన్  సమయంలో ఎలాంటి రవాణా సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో మాస్టర్ ప్లాన్ వేసాడు యువకుడు. ముంబై విమానాశ్రయంలో పని చేస్తూ ఉండే యూపీ లోని  అలహాబాద్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ప్రేమ్  మూర్తి అనే యువకుడు... తను మాస్టర్ ప్లాన్ ద్వారా స్వగ్రామానికి చేరుకున్నట్లు  తానే మీడియాకు వెల్లడించారు ఆసక్తిని రేపుతోంది. 

 

 

 అయితే తొలి దశలో లాక్ డౌన్  సమయాన్ని మొత్తం ముంబైలోనే గడిపాడు సదరు యువకుడు. ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్లొచ్చు అని అనుకుంటున్న సమయంలో లాక్ డౌన్ పొడిగించారు ... తర్వాత దీన్ని మరింత కాలం పొడుస్తారు అనే అనుమానంతో ఎలాగైనా ఊరికి వెళ్లాలి అని భావించాడు. అయితే తాను అంధేరీ ఈస్ట్ ప్రాంతంలోని ఆజాద్ నగర్ లో ఉంటానని అది  ఎంతో ఇరుకైన ప్రాంతమని వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు పుష్కలంగా ఉండటం కారణంగా... ఏదో ఒక ప్లాన్ వేసి స్వగ్రామానికి చేరుకోవాలని భావించినట్లు  యువకుడు తెలిపాడు. ఈ క్రమంలోనే నిత్యవసరాలైన  పండ్లు కూరగాయలకు అనుమతి ఉందని తను గమనించినట్లు తెలిపిన ప్రేమ్... ఏప్రిల్ 17వ తేదీన నాసిక్ లోని మార్కెట్ నుంచి మినీ ట్రాక్టర్ ను అద్దెకు తీసుకుని 10 వేల విలువైన పుచ్చకాయలను కొనుగోలు చేసి... దానితో పాటు ముంబైకి ప్రయాణించి ట్రై చేశాడు. ఇక ఆ పుచ్చకాయలు విక్రయించి తాను పెట్టుబడి పెట్టిన మొత్తం ని వెనక్కి తెచ్చుకున్నాడు సదరు యువకుడు. 

 

 

ఈ క్రమంలోనే ఉల్లిపాయలకు గిరాకీ బాగా ఉందని భావించిన యువకుడు 77 వేల ఐదు వందల రూపాయలు చెల్లించి ఓ లారీ అద్దెకు తీసుకుని ఉల్లిపాయలు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలహాబాద్  కి వచ్చాడు కానీ అక్కడ ఎవరు ఉల్లిపాయలు కొనేందుకు ముందుకు రాకపోవడంతో ఏమిచేయలేక నగర శివారులో లారీ ని నుంచి తన స్వగ్రామమైన కోట్ల  ముబారకపూర్  కు వెళ్లి... టిఫి నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వివరాలు తెలిపారు. ఇక అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం హోం క్వారంటైన్  చేశారు పోలీసు అధికారులు. ఇక తాను తెచ్చిన ఉల్లిపాయల లోడ్  కూడా అమ్మకం జరుగుతుంది అని నమ్మకం ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు సదరు యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: