ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందు నుంచి మొండి స్వ‌భావం ఉన్న వ్య‌క్తి. ఆయ‌న తండ్రి దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి  సీఎంగా ఉన్న‌ప్ప‌టి నుంచే జ‌గ‌న్ రాజ‌కీయంగా దూకుడుగా ఉండేవారు. అంతెందుకు వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత సోనియా గాంధీ కుటుంబంతో పాటు అప్ప‌టి సీఎంలుగా.. మంత్రులుగా ఉన్న వారి నుంచి తీవ్ర అవ‌మానాలు ఎదుర‌య్యాక మ‌రో నాయ‌కుడు ఆ ప్లేస్‌లో ఉంటే రాజ‌కీయంగా క‌నుమ‌రుగు అయిపోయేవాడే. జ‌గ‌న్ మొండి అయిన జ‌గ‌న్ కాంగ్రెస్‌ను వ‌దిలి బ‌య‌ట‌కు వ‌చ్చి పార్టీ పెట్టుకుని ఎంపీగా గెల‌వ‌డంతో పాటు త‌న త‌ల్లిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 

 

ఆ త‌ర్వాత 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబునే ఢీ కొట్టి సీఎం అయ్యారు. ఇక క‌రోనా వేళ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ప‌దే ప‌దే కొన‌సాగించాల‌ని చెపుతున్నా జ‌గ‌న్ మాత్రం రెడ్ జోన్ల‌లో మాత్ర‌మే లాక్ డౌన్ కంటిన్యూ చేస్తూ క‌రోనా ప్ర‌భావం లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తి వేయాల‌ని ప‌దే ప‌దే చెపుతూ వ‌చ్చాడు. చివ‌ర‌కు అదే నిజ‌మైంది. ఇప్పుడు ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్నం కాకుండా ఉండాలంటే రెడ్ జోన్ల‌లో మాత్ర‌మే లాక్ డౌన్ ఉండాల‌న్న నిర్ణ‌యానికి ప్ర‌ధానితో పాటు దేశంలో ఉన్న అంద‌రు ముఖ్య‌మంత్రులు వ‌చ్చారు. 

 

ఇటు రాష్ట్రంలో క‌రోనా ఉన్నా జ‌గ‌న్ మాత్రం ఈ టైంలోకూ ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ విష‌యంలో జ‌గ‌న్‌పై కొన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా ఎక్క‌డా లెక్క చేయ‌డం లేదు. అటు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను ఆర్డినెన్స్‌తో తొల‌గించ‌డం కాని... మ‌నం భ‌విష్య‌త్తులో మ‌నం క‌రోనాతో క‌లిసి జీవించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని.. ఈ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలే కాని..ఈ లాక్ డౌన్ కంటిన్యూగా కొన‌సాగించ‌డం క‌రెక్ట్ కాద‌ని చెప్పారు. ఇక ఇప్పుడు అంద‌రూ జ‌గ‌న్ మాట‌తో ఏకీభ‌విస్తున్నారు.

 

మ‌రో వైపు దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా ఏపీలో ఏకంగా ల‌క్ష టెస్టులు చేశారు. ఏదేమైనా జ‌గ‌న్ మ‌రోసారి త‌న‌దైన మొండిత‌నంతోనే ముందుకు వెళుతున్నారే త‌ప్పా ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లో గ‌తంలో ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా హ‌డావిడి లేక‌పోయినా ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: