ఎప్పుడు ఎలాంటి విషయంలో అయిన  వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు కేంద్రంలోని బిజెపి పెద్దలు. తాజాగా కరోనా వైరస్  విషయంలో కూడా ఎన్నో వ్యూహాత్మక చర్యలు చేపడుతూ  కరోనా  వైరస్ నియంత్రణకు కీలక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మరో ముందడుగు కూడా వేసింది కేంద్రంలోని బీజేపీ. నరేంద్ర మోడీ అమిత్ షా బిజెపి పెద్దలు అందరూ... కరోనా  వైరస్ సందర్భంగా ఇళ్ళలో స్ట్రక్ అయిన  ప్రజలతో వివిధ పార్టీల నేతలు, గ్రామాల సర్పంచ్ లతో  మాట్లాడటం అంతేకాకుండా గ్రామస్థాయి మండల స్థాయిలో ఉన్న బిజెపి నేతలు సీనియర్ నేతలతో మాట్లాడటం లాంటివి స్వయంగా చేసిన విషయం తెలిసిందే. 

 


 పార్టీలకతీతంగా ఇలా  స్వయంగా నరేంద్ర మోడీ ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకొని కరోనా సందర్బంగా  ధైర్యం చెప్పిన సందర్భం మనం చూశాం. అయితే ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి ఒక వ్యూహాత్మకమైన అడుగు వేస్తే బాగుంటుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం 70 ఏళ్ళ వయసున్న చంద్రబాబు నాయుడికి అపార రాజకీయ అనుభవం ఉంది.  అంతేకాకుండా పార్టీ కోసం పాటుపడిన నేతలు ఎవరు... వారి పేరు ఏమిటి... ఊరు ఏమిటి అన్న  జ్ఞాపకశక్తి కూడా చంద్రబాబు సొంతం. 

 


 ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా  సమయంలో కేవలం పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించడమే కాకుండా పార్టీ కోసం పాటుపడిన ఎంతోమందికి స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు ధైర్యం చెబుతే  ఎంతో బాగుంటుందని... చంద్రబాబుకు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా కూడా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. అంతేకాకుండా ప్రస్తుతం ఎంతో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా పార్టీ కార్యకర్తలకు పార్టీ కోసం పాటు పడిన వారికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడితే అది ఎంతో హుందా తనం గా కూడా ఉంటుందని...  ఇలాంటి మంచి పనులు ఎవరు చేసిన వారిని ఆదర్శంగా తీసుకొని చేయడంలో తప్పేమీ లేదు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: