కేంద్ర ప్రభుత్వం కరోనా కేసుల విషయంలో తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఆస్పత్రుల్లో కరోనా భారీన పడి చికిత్స పొందుతున్న వారిలో స్వల్ప, మద్యస్థ లక్షణాలున్న వారికి నయమైతే నిర్ధారణ పరీక్షలు చేయకుండానే డిశ్చార్జి చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిన్న డిశ్చార్జి నిబంధనలలో మార్పులు చేస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం బాధితుల రోగ తీవ్రత ఆధారంగా వారిని స్వల్ప కాలిక, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలున్న వారిగా విభజించింది. 
 
కరోనా తీవ్ర లక్షణాలు ఉన్నవారిని వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసి డిశ్చార్జ్ చేయాలని... ప్రస్తుతం కరోనా భారీన పడి చికిత్స పొందుతూ లక్షణాలు కనిపించని వారిని ఇంటికి పంపించాలని ఆదేశించింది. స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులు మూడు రోజులు మందులు వాడకపోయినా వారిలో జ్వరం ఉండకూడదు. అప్పటికే ఆ వ్యక్తికి లక్షణాలు మొదలై 10 రోజులు పూర్తై ఉండాలి. 
 
ఆ రోగిలో ఆక్సిజన్ లెవెల్స్ సరిపడా ఉండటంతో పాటు... ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడకూడదు. కరోనా రోగి డిశ్చార్జి అయిన తరువాత ఏడు రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉంచాలని సూచించింది. ఇంట్లో ఎవరితో నేరుగా మాట్లాడకూడదని... డిశ్చార్జి తరువాత ఎటువంటి సమస్యలు ఎదురైనా హెల్ప్ లైన్ నంబర్లను వెంటనే సంప్రదించాలని సూచించింది. 
 
14వ రోజున వైద్య సిబ్బంది టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తారు. మధ్యస్థ లక్షణాలు ఉన్న వ్యక్తులకు కూడా ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే  డిశ్చార్జి చేయాలని కేంద్రం ఆదేశించింది.చివరి మూడు రోజులు జ్వరం వంటి లక్షణాలు లేకపోతే ఆ వ్యక్తిని పరీక్ష చేయకుండానే ఇంటికి పంపిస్తారు. ఆ వ్యక్తి ఇంట్లో ఏడు రోజులు ఐసోలేషన్ లో ఉండాలి. అత్యంత సీరియస్ కేసుల్లో మాత్రం కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి ఇంటికి పంపించాలని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: