కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో టిడిపికి కాస్తో కూస్తో పట్టు ఉన్నా, రాయలసీమలో మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టుగా కనిపిస్తోంది. రాయలసీమలో 52 అసెంబ్లీ, 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇవి అన్ని పార్టీలకు చాలా కీలకమైనవి. గతంలో కాంగ్రెస్ పార్టీని ఇక్కడి జనాలు ఆదరించారు. ఎందుకనో ఏంటో తెలియదు కానీ, అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు అధికారంలో ఉండగా ఆ ప్రాంతాన్ని పట్టించుకోవడమే మానేశారు. 2011 నుంచి రాయలసీమలో జగన్ హవా మొదలైంది. సీమ ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ మారిపోయారు. సీమ ప్రాంతానికి చెందిన అసలు సిసలైన నేతగా జగన్ అక్కడి ప్రజల్లో నమ్మకం కలిగించారు. దీంతో ఆయనకు ఆ ప్రాంతంలో ఎదురే లేకుండా పోయింది. పక్క జిల్లాలకు చెందిన చంద్రబాబు సీమ ప్రాంత వాసి అయినా  జనాలు మాత్రం ఆయనను మొదటి నుంచి అంతగా గుర్తించలేదు. అందుకే రాయలసీమ జిల్లాల్లో జగన్ కు ఎదురే లేకుండా పోయింది. 

IHG


జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలోని కర్నూలును రాజధానిగా ప్రకటించడమే కాకుండా, హైకోర్టును ఏర్పాటుచేస్తామని చెప్పారు. అలాగే కడపలో ఉక్కు పరిశ్రమ తో పాటు, సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుండటం, అలాగే రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు సామర్థ్యం పెంచడం వంటివి జగన్ మీద సీమ ప్రాంత వాసులు పెట్టుకున్న నమ్మకాన్ని మరింతగా పెంచాయి. ఈ విషయంలో అదే రాయలసీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు సూటిగా తన అభిప్రాయం చెప్పలేకపోవడం, ఇప్పుడు ఆయన అభాసు పాలు అయ్యేలా చేస్తోంది. 


ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలు మాత్రమే కాస్తో కూస్తో టీడీపీకి పట్టున్న ప్రాంతాలుగా కనిపిస్తున్నాయి తప్ప రాయలసీమలో మొత్తం తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయేలా కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లోనే రాయలసీమ లో తెలుగుదేశం పార్టీ చతికిలబడింది. వచ్చే ఎన్నికల్లో పూర్తిగా చతికిలబడినా ఆశ్చర్యం లేదు అన్నట్టుగా ఇప్పటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: