గత కొద్ది రోజులుగా భారత్ చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు పలుమార్లు భేటీ అయ్యారు.లద్దాఖ్ లోని భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందా....? అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను రాహుల్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లద్దాఖ్ ఎంపీ సెరింగ్ నంగ్యాల్ తాజాగా రాహుల్ ప్రశ్న గురించి స్పందించారు. 
 
సెరింగ్ నెంగ్యాల్ దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే చైనా భారత్ భూభాగాన్ని ఆక్రమించుకుందని అన్నారు. చైనా భారత్ ను ఆక్రమించిందంటూ చైనా ఆక్రమించిన ప్రదేశాలను సూచిస్తూ ఫోటో, అ ఫోటోకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 1962లో కాంగ్రెస్ హయాంలో 37,244 చదరపు కిలోమీటర్ల అక్రాయి చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని ఆయన చెప్పారు. 
 
మరోవైపు చైనా భారత్ దేశాల మధ్య వివాదం పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. చైనా తాజాగా భారత్ తో జరుగుతున్న చర్చల గురించి కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల ద్వారా అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయని తెలిపింది. ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ప్రకటన చేసింది. 

 


 
భారత్ చైనా వివాదం పరిష్కారం దిశగా అడుగులు పడుతుండటంతో ఇరు దేశాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. నియంత్రణ రేఖ దగ్గర శాంతిని నెలకొల్పేందుకు ఇరు దేశాలు ఇప్పటికే అంగీకరించాయి. దేశాల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను వివాదాలుగా మార్చకూడదని ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ప్రస్తుతం బెటాలియన్ కమాండర్ స్థాయి, మేజర్ జనరల్‌ల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: