ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఓ వైపు చైనా భారీగా తమ సైన్యాన్ని భారత్ చైనా సరిహద్దు ల్లో మొహరీస్తూ ఉంటే మరోవైపు బారత్ కూడా ఎంతో పవర్ఫుల్ ఆయుధాలను సైన్యాన్ని భారత-చైనా సరిహద్దు ల్లో మోహరిస్తుంది, ఇక భారత్ చైనా మధ్య తలెత్తిన వివాదం ప్రపంచ దేశాలన్నింటిలో హాట్ టాపిక్ గా మారిపోయింది, భారత్ చైనాల మధ్య యుద్ధం తప్పేలా లేదు అనేలా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం భారత్ కి వివిధ దేశాలు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. 

 


 ఒకవేళ చైనాతో గనక యుద్ధం చేయాల్సి వస్తే తాము భారత్ వెన్నంటే ఉంటాను అంటూ చైనా జపాన్ ఫిలిప్పీన్స్ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి, చైనా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టాయి ఆ దేశాలు. అయితే ప్రస్తుతం చైనా తీరుపట్ల వ్యతిరేకంగా ఉన్న మరో దేశం  ప్రస్తుతం భారత్ కి మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చింది. చైనా తీరుపట్ల మొదటినుంచి తటస్థంగా ఉన్న ప్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్  చేసినటువంటి ప్రకటన ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది. 


 వీర మరణం పొందిన 20 మంది జవాన్లకు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు... సైనికుల మరణం తమ కుటుంబాలకు దేశానికి తీరని లోటు అంటూ వ్యాఖ్యానించారు. అయితే తమ దేశాల నుంచి సాయుధ దళాల తో పాటు స్నేహపూర్వక మద్దతును తెలియజేస్తున్నటు ప్రకటించారు ఆయన. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో రోజురోజుకు పరిస్థితి మరింత సీరియస్ గా మారుతున్న నేపథ్యంలో అటు భారత్ కూడా యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం చైనా తీరును తప్పుబడుతూ భారత్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని  అంటూ ఎన్నో దేశాలు  భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ నేపధ్యంలో యుద్ధమే గనుక జరిగితే చైనా పరిస్థితి ఏమవుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: