దీంతో చైనాకు ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. భారత్ లో అత్యంత ఆదరణ చెందిన టిక్ టాక్ హలో లాంటి యాప్స్ ను నిషేదించింది. ఇప్పుడు ఎంతగానో ఆదరణ కలిగిన పబ్ జీ సహా 118 యాప్స్ పై వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తత నేపథ్యంలో భారత కీలక సమాచారం తస్కరణ కు గురయ్యే అవకాశం ఉందని అందుకే బ్యాన్ చేస్తున్నాము అంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. తాజా నిర్ణయంతో చైనా కు భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. పబ్ జి యాప్ ను నిషేధించిన నేపథ్యంలో పబ్జి వినియోగదారులు అందరూ ప్రస్తుతం సరికొత్త వాదనను తెరమీదకు తెస్తున్నారు.
పబ్ జీ అసలు చైనా కు సంబంధించింది కాదని... కొరియా కు సంబంధించింది అంటూ ఒక సరికొత్త వాదనను ప్రస్తుతం తెరమీదికి తెస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సరికొత్త వాదనపై స్పందిస్తున్న విశ్లేషకులు అందరికీ క్లారిటీ ఇస్తున్నారు... ప్రస్తుతం పబ్ జీ రెండు దేశాల కంపెనీల కు చెందినదిగా ఉంది అంటూ చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో వాడుతున్న మొబైల్ వర్షన్ పబ్ జీ చైనాకు చెందినది అని... దీనికి సంబంధించిన సర్వర్లు కూడా పూర్తిగా చైనాలోనే ఉన్నాయని... కానీ కంప్యూటర్ కు సంబంధించిన పబ్ జీ మాత్రం కొరియాకు చెందింది అంటూ క్లారిటీ ఇస్తున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి