ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అనగా సుమారు ఒంటి గంట సమయం లో ఈ చోటు చేసుకుంది. ఆలయ సిబ్బంది ఈ రధాన్ని షెడ్డు లో భద్రపరిచారు. ఆ షెడ్డు లో ఉన్న పురాతన రథానికి మంటలు అంటుకొని దగ్ధం అయ్యిపోయింది. అయితే ఈ ఘటన జరగడానికి కారణం ఏమిటి అనేది ఇంకా పూర్తిగా తెలియ లేదు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా విద్రోహ చర్య అన్న అంశం పై పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది.
ఈ ఘటన పై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలానే ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన స్పందించడం జరిగింది. వెంటనే దేవదాయ కమిషనర్ పి.అర్జున రావు, జిల్లా ఎస్పీతో ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది. అలానే దేవదాయ, పోలీస్, పైరింజన్, రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడి ఈ విషయం గురించి ఆయన తెలుసుకోవడం జరిగింది. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని కమిషనర్ రామ చంద్ర మోహన్‌ను విచారణ అధికారిగా నియమించడం జరిగింది.''అంతర్వేది ఘటన దురదృష్టకరం'' అని స్వరూపానందేంద్ర అన్నారు . అలానే రధం ఆహుతి కావడంపై తక్షణం విచారణ జరపాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. దుండగుల చర్యగా తేలితే కఠినంగా శిక్షించాలన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి