కేరళ రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకొని ప్రతి ఒక్కరిని విస్తుపోయేలా చేస్తోంది. రాష్ట్రంలోని తిరువనంతపురం లో ఒక కొవిడ్-19 చికిత్స అందించే డాక్టర్ తన పేషంట్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల సమాచారం ప్రకారం ఒక జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్/ డాక్టర్ కొవిడ్-19 రిపోర్టు ఇస్తానని ఇంటికి పిలిపించుకుని మరీ ఆమె చేతులు తాడుతో కట్టేసి రేప్ చేశాడు. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సుణేష్ మాట్లాడుతూ... బాధితురాలు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి అత్యంత కిరాతకంగా రేప్ చేశాడని... బాధితురాలిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని... జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నామని ఆయన అన్నారు.


కొన్ని రోజుల క్రితం ఆసుపత్రికి కరోనా వైరస్ నిర్ధారణ టెస్ట్ చేయించుకుందామని వెళ్ళినా మహిళతో మాటలు కలిపి... లక్షణాలు ఉన్నాయంటూ అబద్ధం చెప్పి ఫలితాలు వచ్చేంతవరకు ఆమెను హోమ్ క్వారంటైన్ లో ఉండమని హెల్త్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆ తర్వాత ఫలితాలు వచ్చాయని... కోవిడ్ 19 నెగిటివ్ గా నిర్ధారణ అయ్యిందని... నెగిటివ్ రిపోర్ట్ ఇంటికి వస్తే ఇస్తానని చెప్పాడు. దాంతో ఆమె అతడి ఇంటికి వెళ్లగా... ఆమెను లాక్కెళ్ళి బలత్కారం చేశాడు.


ఈ విషయం కాస్త అందరికీ తెలియడంతో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కే కే శైలజ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే నిందితుడైన హెల్త్ ఇన్స్పెక్టర్ ని  వెంటనే విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అయితే అత్యాచారానికి పాల్పడిన హెల్త్ ఇన్స్పెక్టర్ పేరు ప్రదీప్ అని పోలీసులు వెల్లడించారు. వైద్య రంగంలో ఇటువంటి నీచుల ఉండటం వలన అందరికీ చెడ్డపేరు వస్తుందని రాష్ట్ర ప్రతిపక్షం అధినేత రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రజలను కాపాడే చేయాల్సిన పోలీసులు, డాక్టర్లే సామాన్య ప్రజలపై అత్యాచారాలకు పాల్పడటం చాలా విషాదకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: