నిన్న పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి దూసుకుపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. నిన్న జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది అనే చెప్పాలి. ఇక గతంలో ఇదే మైదానంలో పంజాబ్ జట్టు కెప్టెన్ ఓపెనర్ కె.ఎల్.రాహుల్ 132 పరుగులు చేసిన రికార్డు ఉండడంతో ఈ సారి కూడా విజృంభించి ఆడతాడని క్రికెట్ ప్రేక్షకులు అనుకున్నారు. కానీ సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి కె.ఎల్.రాహుల్ నిలవలేకపోయాడు.
కేఎల్ రాహుల్ చేసిన తప్పిదం మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ను రన్ అవుట్ చేసిన విషయం తెలిసిందే. పంజాబ్ జట్టు 17ఓవర్ లు ముగియకముందే ఆలౌట్ అయ్యి 132 పరుగులకు మాత్రమే పరిమితమైంది. నిన్నటి విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా విరాట్ కోహ్లీ జట్టును వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక భారీ విజయంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు అందరూ ఫుల్ ఖుషీ అయ్యారు అని చెప్పాలి. ఐపీఎల్ ప్రారంభం నుంచి సరైన విజయం లేక నిరాశలో ఉన్న అభిమానులకు అందరికీ.. నిన్న జరిగిన మ్యాచ్లో విజయం సరికొత్త ఉత్సాహం నింపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి