ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు కు రాసిన లేఖపై సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.. లేఖలు అంగీకరించినట్లే గాని, లేక పై విచారణ కొనసాగిస్తామని, లేఖను తిరస్కరిస్తున్నట్లు గాని, రాయడం తప్పు అని గాని, ఒప్పు అని గాని.. సుప్రీంకోర్టు నుంచి స్పష్టత లేదు. న్యాయవాది నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో.. ఈ లేఖ పై మాజీ న్యాయమూర్తులు కొందరు సమర్ధిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తెలుగు లో ఉన్నటువంటి రాజకీయవిశ్లేషకులు.. ఎ టు  రూటు అటే ఉంది.. అయితే ఈ సందర్భంలో ఎన్వి రమణ గారిని ఈ లేఖ లో.. వివాదాస్పదం చేశారు


కాబట్టి ఢిల్లీ బార్ అసోసియేషన్ న్యాయ వ్యవస్థ సంఘాలు వరుసగా స్పందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆల్ ఇండియా జడ్జ్స్ అసోసియేషన్ దీన్ని తీవ్రం గా ఖండిస్తుంది. ఇందులో భాగంగానే ఒక స్టేట్మెంట్ ను కూడా విడుదల చేశారు.. న్యాయమూర్తుల  అసోసియేషన్ అందరూ కూడా న్యాయ వ్యవస్థను కాపాడే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అయితే దేశ వ్యాప్తంగా 6 అక్టోబర్ 2020 నాడు జరిగిన సంఘటన దేశ చరిత్రలోనే.. న్యాయ వ్యవస్థకు మచ్చ తీసుకువచ్చేలా ఉందని అసోసియేషన్ డైరెక్టర్ అజయ్ నటనే, ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ అసోసియేషన్ లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు.


 దీని హెడ్ క్వార్టర్ గుజరాత్ లోని' వడోదర'లో ఉంది. అయితే ఈ లేఖ పై మరిన్ని పరిణామాలు ఎక్కువవడంతో పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఒకవైపు రాజకీయ నాయకులకు-దేశ న్యాయమూర్తులకు మధ్య జరుగుతున్న ఒక పోరాటం గా చెప్పవచ్చని విశ్లేషకుల అంచనా. అయితే సుప్రీం కోర్ట్ ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుం దో.. అని దేశ సర్వత్ర న్యాయమూర్తులు ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: