ఏనుగులు మాట్లాడుకునేవి ఎవరికి అర్ధం అవుతాయి..? నిజంగా ఈయన గ్రేట్ అనే అనాలి. ఎందుకంటే కుశాల్ కొన్వార్ శర్మ కి వాటి భాష అర్ధం అవుతుందట. ఆయనని  అందరూ ఏనుగుల డాక్టర్ అని పిలుస్తుంటారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆయన ఏనుగుల సంరక్షణలో 35 ఏళ్ల నుంచీ గడుపుతున్నారు. ఎంత గొప్ప విషయమో కదా....! వేల ఏనుగుల ప్రాణాలను భారత్, ఇండోనేసియా అడవుల్లో కాపాడడం జరిగింది. కుటుంబం తో కంటే కూడా ఏనుగులతోనే ఎక్కువ సమయం గడుపుతాడట. అలానే వాటితో ఉంటే ఆనందంగా ఉంటారట. అంతే కాదు  ఏనుగులు మాట్లాడే ''భాష'' కూడా అర్థం అవుతుంది. వాటికి ఆహారం తినిపించడంతో పాటు సంజ్ఞలతో అయన మాట్లాడతారు.

మొదటిసారి ఏనుగులకు చికిత్స అందిచేందుకు మానస్ నేషనల్ పార్క్‌కు ఆయన వెళ్లారట. అలానే ఏనుగులతో తన అనుబంధం బాల్యం నుంచే ముడిపడింది అని తానె స్వయంగా చెప్పడం జరిగింది. చిన్నప్పుడు ఏనుగు మీద తిరగడంతోనే వాటి పై మక్కువ పెరిగింది అని అన్నారు. ఇది ఇలా ఉండగా  వర్షాకాలంలో అసోంలో ఏనుగులకు ఆయన మరింత చేరువ అవుతుంటారు. ఇక్కడ వర్షాకాలంలో వరదలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వన్యప్రాణుల ప్రాణాలకే ముప్పు తెస్తుంటాయి అని చెప్పారు.

గత జులైలోనూ ఇక్కడ వరదలు ముంచెత్తాయి. దీంతో 51 జంతువులు పార్క్‌లో మరణించాయని అధికారులు వెల్లడించారు. అయితే వరదల సమయంలో ఆయన్ని పిలవకపోయినా ప్రతిసారే నేనే వెళ్తాను అని చెప్పారు. ఎందుకంటే వీలైనన్ని ఎక్కువ జంతువులను కాపాడాలని భావిస్తాను అని చెప్పారు. అసోంలోని 3,00,000 కి.మీ. పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వేల కొద్దీ ఏనుగులకు ఆయన సేవ చేశారు. ఎన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ తన వృత్తి తనకు సంతృప్తిని ఇస్తుందని ఆయన వివరించారు. తన కుమార్తె తన నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన ఆశిస్తున్నారు. ఆమె కూడా నాలాగే ఏనుగులకు సాయం చేయాలి అని అనుకుంటున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: