బీహార్ ఎన్నికల సమీపిస్తున్న వేళ బీహార్ రాజకీయాలు  వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక సాధారణంగా అసలు ప్రజల కంటికి కనిపించని నాయకులందరూ ప్రస్తుతం ప్రజల్లోనే తిరుగుతూ ప్రజల కష్టాలు తీరుస్తా హామీలు ఇస్తున్నారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనే విషయాన్ని కూడా ప్రజలందరికీ చెబుతూ ఎంతో వినూత్నంగా ప్రచారం చేపడుతున్నారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిపక్ష అధికార పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలను ఆయా పార్టీల రంగంలోకి దింపి ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.



 ఇక బీహార్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అందరూ ముమ్మర ప్రచారం చేపడుతూ ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు అన్న విషయం తెలిసిందే. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించి అధికారం చేపట్టాలని ఎన్డీఏ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అదేసమయంలో ప్రతిపక్ష పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి భారీ షాక్ ఇవ్వాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఎవరి స్టైల్ లో  వారు ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ మహాశయులకు అందరిని ఆకర్షించేందుకు ఎన్నో హామీలవర్షం కూడా కురిపిస్తున్నారు.



 కేవలం ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించిన వారే కాకుండా అటు రెబల్ అభ్యర్థులు కూడా ఎక్కువగానే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే బీహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. తొలి విడతలో ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 31 శాతానికి పైగా క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇటీవల ఎన్నికల సంఘం తెలిపింది. 168 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతుండగా ఏకంగా మూడు వందల ఇరవై ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కేసులలో కొంత మందిపై  అత్యాచార కేసులు కూడా ఉండగా మరి కొంతమంది పై అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: