ఉన్నత పదవులు చేపట్టాలని ... తద్వారా ఎన్నో మంచి పనులు చేసి సాధారణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నది ఎంతోమంది ఆశయం. నిజానికి అదో పెద్ద కల... ఆశయం ఎంత బలంగా ఉన్నా అందరికీ సాధ్యమయ్యే పనికాదు.. ఒకవేళ అటువంటివి జరిగినా అవి సినిమాల్లోనే చూస్తుంటాం...నిజజీవితంలో చాలా తక్కువగా చూస్తుంటాము. అప్పట్లో అగ్ర హీరో అర్జున్ చేసిన ఒకే ఒక్కడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. హీరో సినిమాలో ఒక సామాన్య వ్యక్తి మాత్రమే... కానీ అతని ఆశయాలు... విలువలు ఎంత ఉన్నతంగా ఉంటాయి. ఆ సినిమాలో అర్జున్ కి ఒక రోజు ముఖ్యమంత్రి గా పనిచేసే అవకాశం దొరుకుతుంది... అప్పుడు తనేంటో నిరూపించుకున్నాడు హీరో..... అయితే ఇదంతా కల్పన.. సినిమా లో జరిగిన ఒక సన్నివేశం మాత్రమే నిజం కాదు.

కాగా ఇలాంటి అవకాశమే నిజజీవితంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా...ఓ బాలికకు వరంలా లభించింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల మన్‌కీ బాత్‌ ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించి ఆమె ఎంత ఆనందించిందో... అలాగే ఆమె ఆశయాలు ఎంత బలంగా ఉన్నాయో చెప్పుకొచ్చారు.ఆ బాలిక పేరు శ్రావణి.  అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఈమెకు ఇటువంటి మహత్తర అవకాశం ఈ రూపంలో లభించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శ్రావణి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఓ బాధిత బాలికకు 25 వేల రూపాయల పరిహారం అందించే ఫైల్‌పై కలెక్టర్ హోదాలో సంతకం చేసిందని ఆ సమయంలో లో ఆమె ముఖం లో మెరిసిన చిరునవ్వు వెలకట్టలేనిదని  ప్రశంసించారు.

ప్రతి విద్యార్థి బాగా చదివి వృద్ధిలోకి వచ్చి ఇటువంటి ఉన్నతమైన పదవులు నిజ జీవితంలో అందుకొని ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా తన భావాన్ని వ్యక్త పరిచాడు ప్రధాన మంత్రి మోడీ. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు 'అమ్మాయే భవిష్యత్తు' పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభించగా.....అందులో భాగంగా, జిల్లా, మండల, గ్రామస్థాయి కార్యాలయాల్లో బాలికలను వివిధ విభాగాల్లో ఒక్కరోజు అధికారిణిలుగా చేశారు. జిల్లాలోని వివిధ స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థినులను లాటరీ ద్వారా ఎంపిక చేసి, వారికి ప్రభుత్వాధికారులుగా ఒక్కరోజు పనిచేసే అవకాశం లభించింది. నేటి బాలలే రేపటి పౌరులు.... అంటూ విద్యార్థులంతా బాగా చదివి వృద్ధి లోకి వచ్చి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలోకి నడిపించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: