టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. దుబ్బాకలో ప్రచారం పూర్తయ్యే వరకు ప్రతి నిమిషం అమూల్యమైనది అని ఆయన అన్నారు. పోలింగ్ పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుంది అని ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో దుబ్బాకలో 20వేల ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కు వచ్చాయి అని ఆయన అన్నారు. అయినా సమిష్టి కృషితో పార్టీకి ఊపు తెచ్చాము అని ఆయన తెలిపారు. దుబ్బాక చుట్టూ గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల ఉన్నా వివక్షకు గురైంది అని ఆయన విమర్శించారు.

టిఆర్ఎస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని పేర్కొన్నారు. చెరుకు ముత్యం రెడ్డి 4సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే  దుబ్బాక  అభివృద్ధి జరిగింది అని ఆయన వివరించారు. రామలింగారెడ్డి ఏం చేయలేనప్పుడు ఆయన సతీమణి ఏం అభివృద్ధి చేస్తుంది అన్నారు. రామలింగారెడ్డి బ్రతికుండగా పట్టించుకోని టిఆర్ఎస్ మరణించిన తర్వాత  ప్రేమ ఉన్నట్లు  యాక్టింగ్ చేస్తోంది అని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి మీద అత్యాచార కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావు కు బీజేపీ అభ్యర్థి దగ్గరి బంధువు అన్నారు.

 రఘునందన్ రావు గెలిచినా టిఆర్ఎస్ లోకి వెళుతారు అని ఆయన పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు అని మండిపడ్డారు. నో ఎల్ఆర్ఎస్, నో టిఆర్ఎస్..అదొక అమానవీయ చట్టం అని ఆయన విమర్శించారు. ఎల్ఆర్ఎస్ ను కాంగ్రెస్ వచ్చాక ఉచితంగా చేస్తుంది అని ఆయన పేర్కొన్నారు. హైద్రాబాద్ లో కాంగ్రెస్ నేత శ్రావణ్ రెడ్డిని పోలీస్ లు ఇబ్బంది పెట్టాడాన్ని ఖండిస్తున్నాం అని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌజ్ లో సోదాలు చేయండని ఆయన సూచించారు. ప్రభాకర్ రావు అనే రిటైర్డ్ అధికారి ద్వారా చట్ట వ్యతిరేకంగా మా ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారు అని విమర్శించారు. రిటైర్డ్ అయిన ఒక సామాజిక వర్గం అధికారులతో ప్రతిపక్ష నేతలను హరాష్ టార్గెట్ చేస్తున్నారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: