కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో 38,073 కొత్త కేసులు నమోదు అయ్యాయి గతంతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువనే చెప్పాలి.. 448 మంది మృతి చెందారు.. ఇదే సమయంలో 42,033 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. కరోనా నుండి కోలుకుంటున్న వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య చూడగా 85,91,730 కు చేరుకుంది.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 79,59,406 మంది కరోనా నుండి కోలుకొని రికవరీ అయ్యారు.. 1,27,059 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,05,265 గా ఉంది..
ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 92.56 శాతం గా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది... ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5.96 శాతంగా ఉంది. తాజాగా విడుదలైన ఈ బులెటిన్ లెక్కల ప్రకారం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది...మరో వైపు రానున్న శీతాకాలంలో వైరస్ వ్యాప్తి మళ్లీ మొదటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.... అయితే ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తే వైరస్ వ్యాప్తి వేగాన్ని అదుపులో ఉంచవచ్చు అని పేర్కొన్నారు ప్రముఖ వైద్య శాస్త్రజ్ఞులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి