ఇక దీంతో భారత క్రికెట్ ప్రేక్షకులందరూ చూపును ఆకర్షించాడు సిరాజ్. దీంతో ఎన్నో రోజుల నుంచి అతనికి అందని ద్రాక్షల ఉన్న భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. భారత సెలెక్టర్లు నుంచి ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ కోసం పిలుపు వచ్చింది. భారత జట్టుకు ఆడాలి అన్నదే సిరాజ్ తండ్రి యొక్క కల. ఇక ఈ క్రమంలోనే హైదరాబాద్ ఆటగాడు సిరాజ్ తండ్రి యొక్క కల నెరవేరింది కానీ... అంతలోనే సిరాజ్ తండ్రి తుదిశ్వాసవిడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న మహమ్మద్ గౌస్ ఇటీవలే తుది శ్వాస విడిచారు,
కాగా ప్రస్తుతం టీం బయో సెక్యూర్ బబుల్ నిబంధన ప్రకారం సిరాజ్ హైదరాబాద్ కు వచ్చే అవకాశం లేదు. దీంతో తండ్రి కల నెరవేర్చిన సిరాజ్ కనీసం కడ చూపు కూడా నోచుకోలేక పోతున్నాడు. దీంతో బరువెక్కిన హృదయంతో నే టీమిండియా తరపున పోరాడేందుకు సిద్ధమవుతున్నాడు సిరాజ్. గతంలో అనారోగ్యం బారిన పడి తన తండ్రి చికిత్స తీసుకొని కోలుకొని ఇంటికి వెళ్లినట్లు తన కుటుంబీకులు ఫోన్లో చెప్పడం తో ఎంతో సంతోష పడి పోయిన మహమ్మద్ సిరాజ్ కు కొన్ని రోజుల్లోనే విషాదకరమైన వార్త విని పించింది. నాన్న చనిపోయాడనే వార్త తనను షాక్ కి గురిచేసింది.. లైఫ్ లో అతిపెద్ద సపోర్ట్ కోల్పోయాను.. దేశం తరఫున ఆడాలనే మా నాన్న కల.. టీమిండియాను ఎంపిక కావడం నాకు సంతోషం కలిగించి ఉంటుంది అంటూ ఆస్ట్రేలియా నుంచి సోషల్ మీడియా వేదికగా స్పందించారు మహమ్మద్ సిరాజ్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి