ప్రస్తుతం చైనాలో ప్రతి వస్తువు తయారికి తక్కువ వ్యయం  పడుతుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా అయితే భారత్లో ఎన్నో రకాల నిబంధనలు ఉంటాయి. ఒక వస్తువు తయారైనప్పుడు వివిధ రకాల పన్నులు  కట్టాల్సి ఉంటుంది  కానీ చైనాలో మాత్రం అలాంటి తరహా పన్నులు  ఏమీ ఉండవు. అందుకే ఎన్నో మల్టీనేషనల్ కంపెనీలు చైనాలో తమ కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. సాధారణంగా అయితే ఇతర దేశాలలో కార్మికులకు వేతనం విషయంలో పనుల విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి.



 కానీ చైనాలో మాత్రం అలాంటివి ఎక్కడ ఉండదు. అందుకే చైనా ప్రభుత్వం చెప్పిందే శాసనంగా మారిపోతూ ఉంటుంది చైనాలో. అందుకే చైనాలో ఇలాంటివి ఉండవు కాబట్టి పదివేల లోపు వేతనాలు కలిగిన వారు  80 శాతం వరకు ఉంటారు. అందుకే అతి  తక్కువ ధరకే చైనాలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందుకే అన్ని టెక్ కంపెనీలు చైనాలో తమ కార్యకలాపాలు సాగించడానికి ఆసక్తి చూపుతూ ఉంటాయి. కాగా  ఇక ఇప్పుడు టెక్ వర్గం కాస్త చైనాను  కాపాడేందుకు సిద్ధమయ్యాయా  అంటే ప్రస్తుతం వినిపిస్తున్న వాదన  ప్రకారం మాత్రం అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది.



 దిగ్గజ సంస్థ అయిన యాపిల్ చైనాను కాపాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అయితే కొన్ని టెక్  కంపెనీల లాబీయింగ్ ప్రకారం
 ప్రభుత్వాలు కంపెనీల నిబంధనలకు అనుగుణంగా పని చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చైనా పై ఉన్న అంశాలను తగ్గించే విధంగా ఆపిల్ అమెరికా-చైనా మధ్య సంప్రదింపులు జరిపేందుకు సిద్దం అవుతుంది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. జపాన్ కు సంబంధించిన అన్ని కంపెనీలు బయటకు వెళ్తూ చైనా నాశనం అయ్యేటువంటి పరిస్థితి వస్తున్న  నేపథ్యంలో... టెక్ కంపెనీలు రంగంలోకి దిగి చైనాను కాపాడేందుకు లాబి  ప్రారంభించాయి  అని ప్రస్తుతం వాదన వినిపించింది. ఇది  ఎక్కడి వరకు వెళుతుంది అన్నది  మాత్రం భవిష్యత్తులో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: