హైదరాబాద్ లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది.. ఎన్నికలకు కేవలం రెండు రోజులు ఉండటంతో పలు పార్టీల నేతలు కార్యకర్తలు ప్రచారంలో జోరును పెంచారు..దుబ్బాక ఫలితాలను మళ్లీ చూడకూడదని టీఆరెఎస్ ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటున్నారు. ఇక బీజేపి సంగతి అయితే చెప్పనక్కర్లేదు..ఏకంగా డిల్లీ నుంచి కీలక నేతలను దించి ప్రచారంలో జోరును పెంచారు.
టీడీపీ ,
కాంగ్రెస్ పార్టీలోని నేతలు ఈ రెండు
పార్టీ లపై ఆధారపడి ప్రచారం చేస్తున్నారు..
ఈ ఎన్నికల విషయంలో ఎక్కడా అల్లర్లు జరగకుండా ఉండాలని పోలీసు శాఖ కూడా అనేక చర్యలను తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో అయితే కట్టుదిడ్డమైన చర్యలను తీసుకుంటున్నారు..తాజాగా సీపీ
మహేష్ భగవత్
మీడియా తో మాట్లాడారు.. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. సులేమాన్
నగర్,
అత్తాపూర్, రామ చంద్రాపురం మొదలగు సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలతో నిఘాను ముమ్మరం చేశారు. 8 వేల మందితో బందోబస్తును మొహరించారు. ఇప్పటికే 573 ప్రాంతాల్లో 1640 పోలింగ్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు ఎవరు కూడా 29వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఉండకూడదని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఇప్పటికే రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌ల పెట్టిన దానికి సంబంధించి మొత్తం 2 కేసులు నమోదు చేశామన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లు, వీడియోలపై 24/7 పూర్తి నిఘా పెట్టామన్నారు. ఇప్పటి వరకు జరిగిన తనిఖీల్లో దాదాపు లక్ష నగదు, 58 వేల రుపాయాల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి ఓటర్లలో శాంతి భద్రతలపై పూర్తి నమ్మకాన్ని కల్పించామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌ను జియో ట్యాగింగ్ చేసినట్లు సీపీ వివరించారు. ఎన్నికలు జరుగుతున్న 30 కార్పొరేషన్ వార్డుల్లో 155 రౌడీషీటర్లను బైండోవర్ చేసి, 543 తుపాకులను సరెండర్ చేశామని చెప్పారు.ఎన్నికల నేపధ్యంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎవరైనా ప్రయత్నించినా, ప్రలోభపెట్టి నా 100 లేదా రాచకొండ వాట్సాప్ 9490617111కు సమాచారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు.