గ్రేటర్ ఎన్నికలకు అన్ని పార్టీలు గట్టిగానే సమాయత్తం అవుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో సూత్రాన్ని పాటిస్తున్నారు. ఏది ఉపయోగించినా ఎలాగైనా ఈ హైదరాబాద్ స్థానిక ఎన్నికలలో విజయం సాధించడమే ప్రధాన  అజెండా. ఇప్పటికే అధికార పార్టీ అన్ని అస్త్రాలను ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగిస్తుండగా ఈ సారి ప్రజలు ఎటువైపు మొగ్గుచూపుతారో తెలియని విధంగా ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మెల్ల మెల్లగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటోంది. దుబ్బాక ఎన్నికలో ఫలితం తరువాత మరింత ఉత్సాహంతో పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగా కస్టపడి పార్టీ అభివృద్ధి కోసం ఈ గ్రేటర్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ఏవిధమైన సెంటిమెంట్ అయితే ఫాలో అయ్యాడో, ప్రజలు ఈ సెంటిమెంట్ కు ఎంతగా కనెక్ట్ అయ్యారో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా అదే విధంగా ఫార్ములాను వాడడానికి సిద్ధమవుతూ ఉంది.

గడిచిన ప్రచారంలో పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న మాటలు ఎంతటి దుమారాన్ని రేపాయో మనము చూసాము. అయితే బండి సంజయ్ అంత ఆషామాషీగా ఈ మాటలు అనలేదని మనము అర్ధం చేసుకోవాలి. ఇక్కడ బండి సంజయ్ హిందుత్వమనే ఫార్ములాని ఉపయోగించాడని క్లియర్ గా అర్ధమవుతూ ఉంది. దేశ సమగ్రత ను కాపాడడానికి బీజేపీ ఎంత దూరమైనా వెళుతుందని ప్రజలకు చెప్పడానికి అలాగే తెలంగాణ హిందువులలో కదలిక తీసుకురావడానికి ఈ ఎత్తుగడ వేశారు.

ఇదేవిధంగా మజ్లీస్ పార్టీ కూడా ముస్లిమ్స్ సెంటిమెంటును బలంగా నమ్ముకుని ఈ ఎన్నికలకు వెళుతోంది. ఈ సెంటిమెంట్ వారిని హైద్రాబాదు నుండి కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ బీహార్ రాష్ట్రాలలో సీట్లను గెలిచేలా చేసింది. ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ కి హిందువుల సెంటిమెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. మరి డిసెంబర్ 1 న జరగనున్న గ్రేటర్ ఎన్నికలలో తెరాస తన పరువును నిలబెట్టుకుంటుందా, లేదా బీజేపీ మరింత పుంజుకోనుందా తెలియాలంటే ఫలితాల వరకు ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: